Fouja Movie: తెలుగులోకి మూడు నేషనల్ అవార్డ్స్ అందుకున్న హిందీ మూవీ... రిలీజ్ ఎప్పుడంటే?
నేషనల్ అవార్డులు అందుకున్న 'ఫౌజ' అనే ఆర్మీ బ్యాక్ డ్రాప్ మూవీ తెలుగులోకి డబ్ కాబోతోంది. ఆ సినిమా విశేషాలు ఏంటో చూద్దాం పదండి.
ఇటీవల కాలంలో దేశభక్తి సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చి, మూడు నేషనల్ అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న హిందీ మూవీ "ఫౌజ" సౌత్ ఆడియన్స్ ని కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? మూవీ విశేషాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే...
2023 బాలీవుడ్ లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఫౌజ". మూడు నేషనల్ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు సౌత్ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. నేషనల్ అవార్డుల్లో ఈ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ డెబ్యు ఫిలిం డైరెక్టర్, బెస్ట్ లిరిక్స్ విభాగాల్లో జాతీయ అవార్డులు వరించాయి. ఈ యాక్షన్ డ్రామా "ఫౌజ" అనే పేరుతోనే తెలుగుతో పాటు తమిళ భాషల్లోకి కూడా డబ్ అవుతుంది. ఈ సినిమాలో కార్తీక్ దమ్ము, ఐశ్వర్య సింగ్ జంటగా నటించారు. పవన్ మల్హోత్రా కీలకపాత్ర పోషించిన ఈ సినిమాకు ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించారు.
"ఫౌజ" మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ ఇటీవలే హైదరాబాద్లో స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. దేశభక్తికి తండ్రి కొడుకుల అనుబంధాన్ని జోడించి డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రసాద్ ల్యాబ్స్ లో "ఫౌజ" మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ తను హైదరాబాద్ లోనే పుట్టాను అని చెప్పుకొచ్చారు. ఇక 'పౌజా' మూవీతో మరోసారి ఇక్కడ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని, సినిమాకి ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు భాషతో సంబంధం ఉండదని, త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో రిలీజ్ కాబోతుందని చెప్పుకొచ్చారు. అయితే మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎల్వి ప్రసాద్ ల్యాబ్ లో వేసిన "ఫౌజ" మూవీ స్పెషల్ స్క్రీనింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమాకి తెలుగు, తమిళ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.
స్టోరీ ఏంటంటే... సినిమా మొత్తం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. ఈ సినిమాలో పవన్ మల్హోత్రా అనే ఫ్యామిలీ లో ఉన్న అబ్బాయిలందరూ ఆర్మీలో జాబ్ చేస్తారు. అలా తన కొడుకు కార్తీక్ కూడా ఆర్మీ ఆఫీసర్ గా చూడాలని, దేశానికి సేవ చేయాలని కలలు కంటాడు పవన్. అయితే కార్తీక్ కు మాత్రం ఆర్మీలో జాబ్ చేయడం అనేది ఏమాత్రం నచ్చదు. ఏదో తండ్రి బలవంతం మేరకు ఉద్యోగం కోసం ప్రయత్నించి ఫెయిల్ అవుతాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకులు మధ్య ఆర్మీ జాబ్ కి సంబంధించి ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయి? తండ్రి కోరికను కొడుకు నెరవేర్చాడా? అసలు అతనికి ఎందుకు ఆర్మీ జాబ్ చేయడం ఇష్టం లేదు? తండ్రి ఎందుకు తన కొడుకు ఆర్మీ లోనే పని చేయాలని కోరుకుంటాడు? అనే విషయాలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Also Read: చిరంజీవికి ఏయన్నార్ అవార్డు... మోహన్ బాబు 'లెజెండరీ' వివాదానికి ఫుల్ స్టాప్ పడేనా?