అన్వేషించండి

Kalyan Ram Movie Shooting: కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్, కాలి బూడిదైన సెట్, నష్టం ఎన్ని కోట్లో తెలుసా?

నందమూరి కల్యాణ్ రామ్ తాజా సినిమా షూటింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షూటింగ్ కోసం నిర్మించిన సెట్స్ పూర్తిగా కాలి బూడిదైంది. కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Fire Accident In Kalyan Ram Movie Shooting Set: నందమూరి హీరో కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షూటింగ్ కోసం నిర్మించిన ప్రత్యేకమైన సెట్ పూర్తిగా కాలిపోయింది. నష్టం కోట్లలో వాటిల్లినట్లు తెలుస్తోంది. నిన్న(మే 10) రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది వచ్చే సరికి సెట్ అంతా కాలిపోయింది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ

ప్రస్తుతం కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతోంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. అశోక్‌ వర్ధన్‌ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఒక రోజు షూటింగ్ మిగిలి ఉండగానే అగ్నిప్రమాదం

గత కొద్ది రోజులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమా ఆర్థిక నేరాలకు సంబంధించి కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సీబీఐ కోర్టు విచారణ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. గత పది రోజులుగా ఇందులోనే పలు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఇంకో రోజు మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రోజు షూటింగ్ కు ముందు ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యుట్ కారణంగా సెట్ కు మంటలు అంటుకోవడంతో పూర్తి నష్టం వాటిల్లింది. సెట్ మొత్తం కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు రూ. 4 కోట్లు నష్టం జరిగినట్లు తెలుస్తోంది.  

చివరగా ‘డెవిల్’ సినిమాలో కనిపించిన కల్యాణ్ రామ్

నందమూరి కల్యాణ్ రామ్ చివరగా ‘డెవిల్’ సినిమాలో కనిపించాడు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ గా రన్ అయ్యింది. ఈ మూవీలో కల్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బింబిసార’ వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ‘డెవిల్’ కూడా సక్సెస్ కావడంతో ఈ జంట హిట్ ఫెయిర్ గా నిలిచింది. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ బాగుందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. నిజానికి ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు అని ప్రకటించినా.. ఆ తర్వాత నిర్మాణంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా తానే తీసుకున్నాడు అభిషేక్ నామా. ఈ సినిమా తర్వాత NKR21 ప్రాజెక్టులో నటిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ అగ్ని ప్రమాదంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం. 

Read Also: అత్యాశకు పోయి ఆస్తులు పోగొట్టుకున్నా - ఆ ఇల్లు కొన్నందుకు అన్నపూర్ణ గారు తిట్టారు, నటి శ్రీలక్ష్మి ఆవేదన

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget