ఓంకార్ తమ్ముడి సినిమాకి లైన్ క్లియర్ - ఈ నెలలోనే రిలీజ్!
ఓంకార్ తమ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు హీరోగా నటించిన 'హిడింబ' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతోంది.

బుల్లితెర ప్రముఖ యాంకర్ కం డైరెక్టర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు పలు సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య చాలా గ్యాప్ తీసుకున్న అశ్విన్ త్వరలోనే 'హిడింబ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొంతకాలంగా అశ్విన్ హీరోగా ఓ భారీ కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయిన అతనికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇక తాజాగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు నటించిన చిత్రం 'హిడింబ'. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. నిజానికి ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలకు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా సినిమాలో అధిక హింస ఉండడంతో సెన్సార్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. రీసెంట్ గానే సెన్సార్ బోర్డ్ ఈ సినిమా క్లియరెన్స్ కి నో చెప్పింది. ఇక తాజాగా సెన్సార్ కమిటీ ముందుకు 'హిడింబ' చిత్రం వెళ్లగా.. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు కొన్ని కట్స్, ఇంకా పలు సన్నివేశాల్లో మ్యూట్ పెట్టి సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చారు. దాంతో ఎట్టకేలకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ పొంది 'హిడింబ' చిత్రం ఈనెల 20న విడుదలకు లైన్ క్లియర్ చేసుకుంది. మొన్నటివరకు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ తాజాగా సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ తో జూలై 20న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
సినిమా సెన్సార్ పూర్తవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. మూవీ రిలీజ్ కు ఇంకా వారం రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దానికి తోడూ ఏజెంట్ మూవీ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించనుండడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ఇక ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రెండు టైమ్ లైన్స్ లో ఈ సినిమా కథ సాగుతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్.
ఇక ఈ సినిమా హీరో అశ్విన్ బాబుకి అత్యంత కీలకమని చెప్పాలి. ఈ సినిమాతో ఎలాగైనా భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ఈ హీరో. సినిమాలో అశ్విన్ బాబు సరసన నందిత శ్వేత హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీ విగ్నేష్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. వికాస్ బాడిసా సంగీతం అందిస్తుండగా... రాజశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు
#HIDIMBHA WW GRAND RELEASE ON 𝗝𝗨𝗟𝗬 𝟮𝟬𝘁𝗵 ❤️🔥
— Rajasekar (@sekartweets) July 11, 2023
"ᴴⁱˢᵗᵒʳʸ ⁱˢ ᵃˡʷᵃʸˢ ᵃ ᴹʸˢᵗᵉʳʸ"#HidimbhaFromJuly20@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #GangapatnamSridhar #SVKCinemas @AnilSunkara1 @AKentsOfficial #OAK @JungleeMusicSTH pic.twitter.com/owxi6ZveSm
Also Read : ‘ధైర్యమే జయం’ అంటూ ‘మహావీరుడు’ని ముందుకు నడిపిస్తున్న రవితేజ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















