అన్వేషించండి

Tammareddy Bharadwaja: హేమ విషయంలో ‘మా’ వెనక్కి తగ్గిందా? తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

రేవ్ పార్టీ వ్యవహారంలో అరెస్టు అయిన హేమ విషయంలో మా తీసుకున్న నిర్ణయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆమెకు బెయిల్ రావడం వల్లే బ్యాన్ బ్యాన్ ఎత్తివేసిందన్నారు.

Tammareddy Bharadwaja About Hema Case: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమకు రీసెంట్ గా ‘మా’ గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెపై విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. రేవ్ పార్టీ కేసులో హేమకు బెయిర్ రావడం వల్లే ‘మా’ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని చెప్పారు. ఒకవేళ విచారణలో ఆమె దోషిగా తేలితే మళ్లీ నిషేధం విధించే అవకాశం ఉంటుందన్నారు.

హేమ ప్రస్తుతం నిందితురాలు మాత్రమే- భరద్వాజ

రేవ్ పార్టీ వ్యవహారంలో నటి హేమ ప్రస్తుతం కేవలం నిందితురాలిగానే ఉందని భరద్వాజ వెల్లడించారు. “ హేమ విషయంలో ‘మా’ వెనక్కి తగ్గడం ఏముంది? బెయిల్ వచ్చింది కాబట్టి వదిలేసి ఉంటారు. చట్టం దృష్టిలో నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నేరం నిరూపణ అయ్యే వరకు ఆమె నిందితురాలే. ఆమెను అరెస్టు చేశారు కాబట్టి, ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. ప్రస్తుతం ఆమెకు బెయిల్ వచ్చింది కాబట్టి, నిజా నిజాలు తెలిసేంత వరకు ఆమె నిందితురాలిగానే ఉంటుంది. నింద అనేది ఎవరి మీదైనా పడొచ్చు. అందుకే ఆమెకు సభ్యత్వం ఇచ్చారు. విచారణలో నేరస్తురాలు అని తేలితే మళ్లీ తొలగిస్తారు” అని భరద్వాజ చెప్పారు.

డ్రగ్స్ కేసులో హేమ మాత్రమే అరెస్టు అయ్యింది-భరద్వాజ    

డ్రగ్స్ విషయంలో ఇప్పటి వరకు టాలీవుడ్ లో హేమ మినహా మరెవరూ అరెస్టు కాలేదన్నారు భరద్వాజ. “డ్రగ్స్ విషయంలో చాలా మంది నటీనటులు విచారణకు వెళ్లారు. కానీ, ఎవరూ అరెస్టు కాలేదు. కేవలం హేమ మాత్రమే అరెస్టు అయ్యింది. ఇంతకీ ఈ కేసుకు సంబంధించి లా ఏం చెప్తుంది అనేది నాకు తెలియదు. డ్రగ్స్ తీసుకుంటే జైల్లో పెడతారా? పెట్టరా? తెలియదు. ఒకవేళ పెడితే, ఈ కేసులో ఉన్న వాళ్లందరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు? బెంగళూరు రేవ్ పార్టీలో మాదక ద్రవ్యాలు దొరికాయా? దొరికితే వీళ్లు బయట ఎందుకు ఉన్నారో తెలియదు. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు 15 ఏళ్ల నుంచి జరుగుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి పిలుస్తారు. ఎంక్వయిరీ చేస్తారు. ఆ వార్తలు మీడియాలో చూపిస్తారు.  ప్రజలు పిచ్చొళ్ల లాగా టీవీల ముందుకు కూర్చొని చూస్తారు. విచారణకు వచ్చిన వాళ్లు నవ్వుతూ వెళ్తారు. విక్టరీ సింబల్స్ చూపిస్తారు. చేతులు ఊపివెళ్లిపోతారు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు లోపల వేయరో తెలియదు. ఎందుకు వదిలేశారో తెలియదు” అన్నారు.

యువత చెడిపోవానికి కారణాలు రెండే- భరద్వాజ

ప్రస్తుతం డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతున్నాయని భరద్వాజ చెప్పారు. “స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, పబ్బుల దగ్గర డ్రగ్స్ దొరుకుతున్నాయి. డ్రగ్స్, ప్రోర్నోగ్రఫీ వల్ల సమాజంలో రేప్ లు పెరుగుతున్నాయి. స్కూళ్లలో జరిగే చాలా కేసులు బయటకు రావడం లేదు. అలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. డ్రగ్స్, ఫోర్నోగ్రఫీని అరికట్టాలని గత 15 ఏళ్ల నుంచి నేను పోరాటం చేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

Read Also: రేవ్ పార్టీ కేసు - ఆ షరతుతో నటి హేమపై ‘మా’ కీలక నిర్ణయం, ఇంతకీ ఏం జరిగిందంటే?

టాప్ హెడ్ లైన్స్

Srinath Maganti: శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
Ramayana Vs Scene: బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
బుకింగ్స్‌లో 'రామాయణ' ఎదురీత... సూర్య 'సీన్' సేల్స్ ఎక్కువ
Tamil Nadu Screening Rules: కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్
కోలీవుడ్‌కు సీఎం విజయ్ గిఫ్ట్... ఎర్లీ మార్నింగ్ షోస్ షురూ - ఆరు షోలు వచ్చాయ్ కానీ ఆ ఒక్కటీ మిస్
Suspense Thriller OTT : 'ICU'లో అసలు ఏం జరిగింది? - 8 నెలల తర్వాత ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్
'ICU'లో అసలు ఏం జరిగింది? - 8 నెలల తర్వాత ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget