Eesha Rebba: నాది కాయిన్స్ డబ్బా ప్రేమ - అతడిపై ఇంట్రెస్ట్ పోయి నో చెప్పేశా: ఈషా రెబ్బా
Eesha Rebba: ఈషా రెబ్బ.. మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపుకు వచ్చింది ఈ భామ. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది. యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. తన లవ్ స్టోరీ గురించి చెప్పింది ఈషా.
Eesha Rebba Shares Her Love Story & Breakup Story: ఈషా రెబ్బ.. అందమైన తెలుగమ్మాయి. మోడలింగ్, మీడియాలో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. 'అంతక ముందు ఆ తర్వాత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈషా.. మంచి హిట్ సినిమాలు చేసింది. అయితే, వైవా హర్షకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె తన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని షేర్ చేసుకుంది. పదో తరగతిలోనే లవ్ చేశానని చెప్పింది. హీల్స్ వేసుకోమన్నాడని నో చెప్పేశానని, అదంతా ఇన్ ఫాచ్యుయేషన్ అంటూ ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది అంటూ పంచుకుంది. మరి ఏంటా లవ్ స్టోరీ?
టెన్త్ నుంచి లవ్..
"స్కూలింగ్ లో ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ అబ్బాయి ఏ టైంలో ఎక్కడ ఉంటాడు అనేంత ఇన్ఫర్మేషన్ ఉండేది మన దగ్గర. అంతలా ఉండేది వాడి మీద ఇష్టం. టెన్త్ లో ఎప్పుడూ కలవలేదు. కానీ, ఇంటర్మీడియెట్ కి వచ్చాక ఫోన్ రూపాయి కాయిన్ ఫోన్ నుంచి తన ఫోన్ కి కాల్ చేసేదాన్ని. నెల రోజులు చేశాను అలాగ. నేను అని తెలీదు అతనికి. కానీ, ఒకరోజు నన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఓకే చెప్పాడు. మాట్లాడుకున్నాం, తిరిగాం. కానీ, రాను రాను ఏమైందంటే? అది ఇన్ ఫాచ్యుయేషన్ అని అర్థం అయ్యింది. తన మీద ఇంట్రెస్ట్ పోయింది. నో చెప్పాను. అతను వాట్ ఏంటి? అని ఆశ్చర్యపోయాడు. బాధపడ్డాడు పాపం. ఆ తర్వాత ఇంక అంతా గార్ల్స్ కాలేజే కదా.. అలా అయిపోయింది. మాది కాయిన్ డబ్బా ప్రేమ. ఇంట్లో కాయిన్స్ దొబ్బేసి మాట్లాడేదాన్ని. వాడికి హిందీ వచ్చు.. నాకు హిందీ కొంచెం కొంచెం వచ్చు. ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుకుంటాం. నా ఇంగ్లీష్ ని ఎక్కిరిచ్చేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. మనం ఒకసారి కట్ అంటే కట్ అంతే" అని తన లవ్ స్టోరీ చెప్పింది ఇషా రెబ్బ.
హిల్స్ వేసుకోమనేవాడు.. నో చెప్పాను..
"ఎందుకు గొడవలు వచ్చాయి అంటే. ఆ అబ్బాయి 6.1 హైట్, నేను 5.5. నాతో బయటికి రావాలంటే 4 ఇంచ్ హీల్స్ వేసుకుని రమ్మన్నాడు. నడవడానికి రాదు నాకేమో. అదే కాదు చాలా రూల్స్ ఉండేవి. ఆ అబ్బాయి మంచి పాష్ కాలేజ్ లో చదువుకునేవాడు. అక్కడ అందరూ పాష్ గా ఉంటారు. నేనేమో శ్రీ చైతన్య. చాలా రూల్స్ ఉండేవి. ఫస్ట్ 10 రోజుల్లోనే ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఉండేవి నాకు. అప్పుడే అర్థం అయ్యింది వీడు నాకు కరెక్ట్ కాదని. అప్పుడే బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ ఏమి చెప్పలేదు. ఫోన్లు ఎత్తడం మానేశాను. అలా మాట్లాడటం ఆపేశాను."
ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టా..
"నాకు చాలామంది ప్రపోజ్ చేశారు. టెన్త్ లో నేను రాఖీ కట్టిన అతనే నాకు ప్రపోజ్ చేశారు. అతను ప్రపోజ్ చేస్తాడనే నేను రాఖీ కట్టాను. టెన్త్ ఫెర్వల్ అప్పుడు ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో నాకు ఎవరు చెప్తే నేను రాఖీ కట్టేసేదాన్ని. స్కూలింగ్ టైంలో జాన్ అబ్రహం అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి కూడా జాన్ అబ్రహం లాగా ఎత్తుగాఉంటాడు కదా.. అలా ప్రపోజ్ చేశా కానీ, బ్రేకప్ అయిపోయింది" అంటూ తన స్కూల్ లవ్ స్టోరీ, ప్రపోజల్స్ గురించి పంచుకున్నారు.