అన్వేషించండి

Ee Nagaraniki Emaindi: మళ్లీ థియేటర్లలోకి ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ - రీ రిలీజ్ ఎప్పుడంటే?

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా జూన్ 29, 2018 లో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఈఎన్ఈ’ ను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Ee Nagaraniki Emaindi: టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వస్తుంటాయి. అయితే అందులో ఎవర్ గ్రీన్ సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. మూవీను మనం ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈ మూవీలో హీరో విశ్వక్ సేన్ ప్రథాన పాత్రలో కనిపించగా అభినవ్, వెంకటేష్, సాయి సుశాంత్ మిత్రలుగా కనిపించారు. ప్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకు మొదట్లో మిక్సిడ్ టాక్ వచ్చినా తర్వాత చాలా మందికి ఈ సినిమా ఫేవరేట్ మూవీ అయిపోయింది. ఇప్పుడీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్.

ఐదేళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి..
 
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా జూన్ 29, 2018 లో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఈఎన్ఈ’ ను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మొదట ఈ సినిమా విడుదల అయినప్పుడు చాలా మంది థియేట్రికల్ ఎక్స్పీరీయన్స్ ను ఎంజాయ్ చేయలేకపోయారు. తర్వాత మూవీను థియేటర్లలో చూస్తూ బాగుండేదని అనుకున్నారు చాలా మంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాను జూన్ 29, 2023 న మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఓ నలుగురు ఫ్రెండ్స్, విభిన్న వ్యక్తిత్వాలు. వాళ్ల జీవితాలు వేరైనా స్నేహం మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అయితే అలాంటి ఫ్రెండ్షిప్ లో కొత్త సమస్యలు వస్తే, వాళ్లు ఆ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారు, ఒకరికి ఒకరు ఎలా అండగా నిలబడ్డారు అనేదే సినిమా. చూడటానికి చాలా సింపుల్ గానే కనిపించినా లోతుగా చూస్తూ చాలా ఎమోషన్స్ ఉంటాయి. మూవీ మొదట్నుంచీ చివరి వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కటి డైలాగ్స్, స్క్రీన్ ప్లే ను అందించాడు దర్శకుడు తరుణ్. అందుకే ఈ మూవీ చాలా మందికి ఫేవరేట్. 

తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపు..

దర్శకుడు తరుణ్ భాస్కర్ కు ‘పెళ్లి చూపులు’ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. దీని తర్వాత తెరకెక్కించిన  ఈ ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ కూడా ఆయన్ను దర్శకుడిగా మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. ఈ మూవీలో కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ సినిమా తర్వాత తరుణ్ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘కీడా కోలా’ సినిమా కోసం పనిచేస్తున్నారు. 

అలాగే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విశ్వక్ సేన్ కు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. అంతకముందు పలు సినిమాల్లో నటించినా ‘ఈ నగరానికి ఏమైంది’ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత విశ్వక్ వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేస్తూ హిట్ లు అందుకున్నారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్

టాప్ హెడ్ లైన్స్

Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
This Week OTT Movies : దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు
దిస్ ఈజ్ ఓటీటీ గోల్డెన్ వీక్ - మా ఇంటి బంగారం To ఫేమస్ వెబ్ సిరీస్‌లు... ఈ వారం 20 సినిమాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget