(Source: ECI/ABP News/ABP Majha)
Ed Sheeran: ఇండియా అలా కాదు, ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతమైన సినిమా - ఎడ్ షీరన్
Ed Sheeran: హాలీవుడ్ పాపులర్ సింగర్ ఎడ్ షీరన్ ముంబాయ్‌లో షో కోసం ఇండియాలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఇండియాపై వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ‘ఆర్ఆర్ఆర్’ తనకు చాలా నచ్చిందని చెప్పాడు.
Ed Sheeran about India and RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ దేశాలను దాటి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కిన తర్వాత అయితే దీని గురించి ఇంటర్నేషన్ స్టేజ్‌పైనే ఒక గుర్తింపు లభించింది. హాలీవుడ్ డైరెక్టర్లు, యాక్టర్లు సైతం ఇండియన్ సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’ అనే స్థాయికి సినిమా చేరింది. ఇప్పటికే ఎంతోమంది ఫారిన్ మేకర్స్.. ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు ఒక పాపులర్ సింగర్ కూడా యాడ్ అయ్యాడు. తను మరెవరో కూడా ఎడ్ షీరన్. ‘ఆర్ఆర్ఆర్’పై ఎడ్ షీరన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండియాపై ప్రశంసలు..
2019లో మొదటిసారి ఎడ్ షీరన్ ఇండియాకు వచ్చాడు. దేశం మొత్తం తిరుగుతూ తన ఇండియన్ ఫ్యాన్స్‌ను అలరించాడు. అప్పుడు ఇండియా నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు రెండోసారి ఇండియాలోకి అడుగుపెట్టాడు ఈ సింగర్. మార్చి 16న ముంబాయ్‌లో పర్ఫార్మ్ చేయడానికి ఎడ్ షీరన్ సిద్ధమయ్యాడు. అదే సందర్భంలో ఒక ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అదే సందర్భంలో తనకు ఇండియాపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. దాంతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. ఎడ్ షీరన్ లాంటి ఇంటర్నేషనల్ సింగర్ దగ్గర నుంచి ప్రశంసలు అందుకోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
అలా నచ్చుతుంది..
‘‘ఇండియాలో నా పట్ల అందరికీ ప్రేమ కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు చాలా లీనమయిపోతారు. వాళ్లు అందులో లీనమయిపోయారని తెలిసినా.. లోపలా ఎంజాయ్ చేస్తున్నా.. ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారో మాత్రం చెప్పలేం. అలాంటి ప్రేక్షకులు ఉన్న చాలా ప్రాంతాల్లో నేను పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాను. కానీ ఇండియాలో అలా కాదు. ఇక్కడ ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. నేను కూడా అలాంటి వాడినే కాబట్టి నాకు అలా నచ్చుతుంది’’ అని ఇండియాను ప్రశంసల్లో ముంచేశాడు ఎడ్ షీరన్. ఇక తన నచ్చిన ఇండియన్ సినిమాల గురించి ప్రశ్నించగా.. ‘ఆర్ఆర్ఆర్’ తనకు చాలా నచ్చిందని, దానికి మెంటల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దానిని అద్భుతమైన సినిమా అని ప్రశంసించాడు.
View this post on Instagram
ముంబాయ్‌లో షో..
‘షేప్ ఆఫ్ యూ’ లాంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు ఎడ్ షీరన్. ‘థింకింగ్ ఔట్ లౌడ్’, ‘క్యాసిల్ ఆన్ ది హిల్’ లాంటి పాటలతో ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నాడు. ఈ జనరేషన్‌లోని ఆర్టిస్టులలో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ సంపాదించుకున్న వారి లిస్ట్‌లో ఎడ్ షీరన్ పేరు కచ్చితంగా ఉంటుంది. అందుకే తను ఇండియాలో ఎప్పుడెప్పుడు షో చేస్తాడా అని తన ఇండియన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. కొన్నిరోజుల క్రితం ముంబాయ్‌లో ల్యాండ్ అయ్యాడు ఎడ్ షీరన్. మార్చి 12న ముంబాయ్‌లోని ఒక స్కూల్‌కు వెళ్లాడు. ఇక మార్చి 16న ముంబాయ్‌లోని మహాలక్ష్మి రేసులో తను పర్ఫార్మ్ చేయడానికి సిద్ధమయ్యాడు.
Also Read: ప్రభాస్ 'కల్కి' పై అమితాబ్ పోస్ట్ - మరోసారి ఆ రూమర్స్‌కి చెక్!