అన్వేషించండి

దుమ్ములేపిన 'దమ్ మసాలా' సాంగ్ - అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్!

మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీ ఫస్ట్ సింగిల్ 'దమ్ మసాలా' లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కి సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ ఉందొ తెలిసిందే. ఆయన సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా నెట్టింట సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. తాజాగా మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం'(Guntur Karam) మూవీ ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డుతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'(Guntur Karam) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ని ఫుల్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నారు గురూజీ.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక సినీ లవర్స్ తో పాటు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ నవంబర్ 7న రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా. 'దమ్ మసాలా'(Dum Masala) అంటూ సాగే ఈ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ లోనే 24 గంటల్లో అత్యధిక మంది చూసిన పాటగా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటకి 24 గంటల్లో ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దీంతో టాలీవుడ్ లోనే అత్యధిక మంది వీక్షించిన లిరికల్ సాంగ్ గా 'దమ్ మసాలా' నిలిచింది.

ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. ఈ పాటని అంతమంది చూడడానికి కారణం తమన్ కంపోజిషన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ తో పాటు విజువల్స్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఈ లిరికల్ సాంగ్ వీడియోలో మహేష్ బాబు బీడీ కాలుస్తూ కనిపించడం, షర్ట్ బటన్ విప్పేసి మాస్ లుక్ లో కనిపించడంతో చాలా కాలం తర్వాత ఈ సాంగ్ లో వింటేజ్ మహేష్ కనిపించారనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే ఈ పాటతో పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతున్న 'దమ్ మసాలా సాంగ్' ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇందులో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీలో సీనియర్ నటుడు జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : నేనూ వాళ్లలా చేయాల్సింది - ఆఫీసులు చుట్టూ తిరిగినా ఛాన్సులు రాలేదు: శ్రీలీల, కృతిశెట్టిపై ఇనయా కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod : అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
అమ్మా మాధురి... వెరీ వెరీ సారీ - బాసింగ బలాలు ఈశ్వర్ సాయి మరో వీడియో
Alpha OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఆలియా భట్ కొత్త మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో

వీడియోలు

Sreemukhi Behavior In Bigg Boss 10 Agnipariksha | అగ్నిపరీక్షలో శ్రీముఖి రూడ్ బిహేవియర్
Bigg Boss 10 Agnipariksha Shalini Patel | బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో రచ్చ చేస్తున్న కామన్ మ్యాన్
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Reservation Hatao Andolan: కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
కులాలను చూసి కాదు ఆర్థిక వెనుకబాటును చూసే రిజర్వేషన్లు ఇవ్వాలి - జెన్‌జీ ఉద్యమం యువతను కదిలిస్తుందా?
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
స్కోడా కుషాక్ 8 స్పీడ్ ఆటోమేటిక్‌ వెర్షన్‌... 6 స్పీడ్ ఆటోమేటిక్‌ కంటే మైలేజ్ ఎంత పెరిగిందో తెలుసా?
స్కోడా కుషాక్ కొత్త ఆటోమేటిక్ కారు నిజంగా ఎంత మైలేజ్‌ ఇస్తోంది? కంపెనీ లెక్క సరిపోయిందా?
చూపులకే పాతది.. నడిపితే కచ్చితంగా ఆశ్చర్యపోతారు! రేంజ్ రోవర్ స్పోర్ట్ EV ప్రత్యేకతలు ఇవే
రేంజ్ రోవర్ స్పోర్ట్‌కు ఇక ఇంధనం అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ SUV చాలా పవర్‌ఫుల్‌ గురూ!
Varanasi Update : వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
వారణాసి కోసం 1500 మందితో... - ఎవరూ ఊహించని రోల్ ప్లాన్ చేశారా?
Type 2 Diabetes : టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
టైప్-2 డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచే అలవాట్లు ఇవే.. రెగ్యులర్‌గా పాటిస్తే మార్పు పక్కా
YS Vivekananda Reddy Case: వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
వివేకా హత్య కేసులో ఈడీ ఎంట్రీ - ఇప్పుడే ఎందుకు? కొత్త అరెస్టులు ఉంటాయా?
Embed widget