Dude Movie : ఫుట్‌బాల్ నేపథ్యంలో ప్రేమకథ - డిసెంబర్‌లో షూటింగ్ 'డ్యూడ్'!
ఫుట్‌బాల్ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం 'డ్యూడ్'. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి.
![Dude Movie : ఫుట్‌బాల్ నేపథ్యంలో ప్రేమకథ - డిసెంబర్‌లో షూటింగ్ 'డ్యూడ్'! Dude Movie starring Tej Regular Shooting starts in December Telugu news Dude Movie : ఫుట్‌బాల్ నేపథ్యంలో ప్రేమకథ - డిసెంబర్‌లో షూటింగ్ 'డ్యూడ్'!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/9ad974243b0b272cacd3ec95970d68251697865825382313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కన్నడ సినిమా అంటే ఇప్పుడు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. ఉపేంద్ర, సుదీప్ వంటి హీరోలు కొన్నేళ్ల నుంచి తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తమకంటూ చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. 'కెజియఫ్', 'విక్రాంత్ రోణ', 'కాంతార', 'సప్త సాగరాలు దాటి' సినిమాల తర్వాత యశ్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి కూడా పేరు తెచ్చుకున్నారు. కన్నడ సినిమాకు మరింత గౌరవం తెచ్చారు. ఇప్పుడు కన్నడలో చిన్న చిన్న హీరోలు కూడా ఇతర భాషల్లో తమ సినిమాను విడుదల చేసేలా ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు.
హీరో తేజ్ స్వీయ దర్శక నిర్మాణంలో...
యువ కథానాయకుడు తేజ్ (Hero Tej) నటిస్తున్న ద్విభాషా చిత్రం 'డ్యూడ్' (Dude Movie). తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు స్వయంగా తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. కథా రచయిత కూడా ఆయనే. అంతే కాదు... పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై ఆయనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయని, డిసెంబర్ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని తేజ్ తెలిపారు.
Also Read : టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?
ప్రేమ కథలు ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు కొత్త కాదు. ఇప్పటి వరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. అయితే... ఫుట్ బాల్ నేపథ్యంలో, పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇటు తెలుగులో కానీ, అటు కన్నడలో కానీ ప్రేమకథా చిత్రం రాలేదని, తమ చిత్రమే ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ అని తేజ్ తెలిపారు. కర్ణాటకలోని 'కిక్ స్టార్ట్' అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్ తమ చిత్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని వివరించారు.
Also Read : 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?
Kannada Hero Tej Movies : ఇంతకు ముందు 'రామాచారి' సినిమాలో తేజ్ నటించారు. 'డ్యూడ్' కాకుండా పాన్ ఇండియా సినిమా 'గాడ్' (God Pan India Movie) ప్రీ ప్రొడక్షన్ లో ఉందని తెలిపారు. 'డ్యూడ్' సినిమాకు వస్తే... కన్నడ, మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని 'అలా మొదలైంది' చిత్రానికి పని చేసిన సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
కన్నడ నటీనటులు అందరూ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయాలని ఆశ పడుతున్నారు. తెలుగు టీవీ సీరియళ్ళలో నటిస్తున్న మెజారిటీ స్టార్స్ కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆర్టిస్టులే. 'దసరా'లో నాని స్నేహితుడిగా నటించిన దీక్షిత్ శెట్టి కన్నడ కుర్రాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర' సినిమాలో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలక పాత్ర చేస్తున్నారు. ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ భార్యగా నటిస్తున్న సీరియల్ స్టార్ చైత్ర రాయ్ కూడా కన్నడ భామే. ఈ జాబితాలో మరికొంతమంది తారలు ఉన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)