అన్వేషించండి

Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' రిలీజ్ వాయిదా పడనుందా? - కారణం ఏంటి?

Double Ismart : పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Double Ismart’s release likely to be delayed : టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రామ్ కెరియర్ లోనే ది బెస్ట్ మూవీస్ లో 'ఇస్మార్ట్ శంకర్' ఒకటి. ఇక ఈ సినిమా పాటలు అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మణిశర్మ కంపోజ్ చేసిన మాస్ ఆల్బమ్ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ ద్వారా చార్మీతో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ను నిర్మిస్తున్నాడు.
 
మరోసారి ఈ సీక్వెల్ కి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. రామ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో నటించిన అన్ని సినిమాల్లోకంటే 'ఇస్మార్ట్ శంకర్' లోనే చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. ఇక ఇప్పుడు 'డబుల్ ఇస్మార్ట్'లో కూడా తన లుక్స్ మరింత స్టైలిష్‌గా ఉంటాయని సమాచారం. ఈ సినిమాని లాంచ్ చేసిన రోజే రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. శివరాత్రి కానుకగా మార్చి 8న 'డబుల్ ఇస్మార్ట్' ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమాని ఫాస్ట్ గా తీయడంలో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ కచ్చితంగా అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్న తరుణంలో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.
 
ఈ సినిమాకి సంబంధించి మరో 40 రోజుల షూటింగ్ పెండింగ్లో ఉందట. కాబట్టి తొందరపడి హడావిడి చేయడం కంటే ఎక్కడా క్వాలిటీ మిస్ కాకుండా ఆడియన్స్ కి థియేటర్స్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని పూరి జగన్నాథ్, రామ్ ఇద్దరు నిర్ణయించుకోవడంతో సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేయాల్సి ఉంటుంది. మార్చిలోనే రిలీజ్ చేయాలంటే వచ్చేనెల మూడో వారంలోపే షూటింగ్ పూర్తి చేయాలి. ఇక కచ్చితంగా ప్రమోషన్లకు నెల రోజులు పడుతుంది.
 
దానికి తోడు పూరీ జగన్నాథ్ 'లైగర్' డిజాస్టర్ తో డౌన్ ఫాల్ లో ఉన్నాడు. అటు రామ్ కూడా 'స్కంద' విషయంలో విపరీతమైన ట్రోలింగ్ ని చూసాడు. కాబట్టి ఈ ఇద్దరికీ 'డబుల్ ఇస్మార్ట్' ప్రాజెక్టు చాలా కీలకం. అందుకే తొందరపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా మార్చి నుండి మే నెలకి 'డబుల్ ఇస్మార్ట్' పోస్ట్ పోన్ కానునట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో రామ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయాన్ని ప్రస్తుతానికి మూవీ టీం సస్పెన్స్ గానే ఉంచింది.
 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - వారణాసి విలన్ కొత్త మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ramba Oorvasi Menaka Trailer : బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు
బోయపాటి స్టైల్ To పవన్ కల్యాణ్ OG డైలాగ్ - అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక ట్రైలర్ నవ్వులే నవ్వులు
Kriti Sanon : బోల్డ్ డ్రెస్‌లో కుక్కకు రాఖీ కడతావా? - బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై విమర్శలు... సోషల్ మీడియా వార్ షురూ
బోల్డ్ డ్రెస్‌లో కుక్కకు రాఖీ కడతావా? - బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌పై విమర్శలు... సోషల్ మీడియా వార్ షురూ
Prince Cecil Wedding : ప్రియురాలితో టాలీవుడ్ హీరో పెళ్లి - న్యూజిలాండ్ వేదికగా ఘనంగా వివాహం
ప్రియురాలితో టాలీవుడ్ హీరో పెళ్లి - న్యూజిలాండ్ వేదికగా ఘనంగా వివాహం

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Karumuri Remand: ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
ఏపీ మాజీ మంత్రి కారుమూరి రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కీలక విషయాలు, 2 వారాల రిమాండ్
Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget