అన్వేషించండి

Double Ismart Update : థాయ్‌లాండ్‌లో 'డబుల్ ఇస్మార్ట్' - దత్, పూరి, ఛార్మితో రామ్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరుగుతోంది.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వం వహించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లను సాధించింది. సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. దానికి సీక్వెల్ (Ismart Shankar Sequel)గా రూపొందుతున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'.  

థాయ్‌లాండ్‌లో 'డబుల్ ఇస్మార్ట్'
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart Movie). జూలై 10వ తేదీన ముంబైలో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. ఆ తర్వాత రెండు రోజులకు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు విదేశాల్లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టారు. 

'డబుల్ ఇస్మార్ట్' రెండో షెడ్యూల్ థాయిలాండ్ (Thailand)లో ప్రారంభమైంది. హీరో రామ్, సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ (Sanjay Dutt)పై  కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవల సంజయ్ దత్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. నటీనటులను బెస్ట్ మాస్ అవతారంలో ప్రజంట్ చేయడంలో పూరి జగన్నాథ్ స్పెషలిస్ట్. 'డబుల్ ఇస్మార్ట్‌'లో   సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. రామ్, సంజయ్ దత్ కాంబినేషన్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది.


'డబుల్ ఇస్మార్ట్'కు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'డబుల్ ఇస్మార్ట్' కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న చిత్రమిది. భారీ తారాగణం, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read  చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?

 

మహా శివరాత్రికి 'డబుల్ ఇస్మార్ట్'
'డబుల్ ఇస్మార్ట్' సినిమాను మహా శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 8న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే... ఇందులో హీరోయిన్ ఎవరు? అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. 'ఇస్మార్ట్ శంకర్'లో నిధి అగర్వాల్, నభా నటేష్... ఇద్దరికీ అవకాశం ఇచ్చిన పూరి జగన్నాథ్, ఈసారి ముంబై హీరోయిన్ల వైపు చూస్తున్నారట.  

Also Read : మా ఊహకు 100 రేట్లు అద్భుతంగా 'కంగువా' వచ్చింది - ఒక్క మాటతో అంచనాలు పెంచేసిన సూర్య

'ఇస్మార్ట్ శంకర్'లో హైదరాబాదీ యువకుడిగా రామ్ పోతినేని సందడి చేశారు. ఇక, సినిమాలో తెలంగాల యాసలో ఆయన చెప్పిన డైలాగులు పాపులర్ అయ్యాయి. రామ్ నటన, పూరి మార్క్ డైలాగులు & దర్శకత్వానికి తోడు మణిశర్మ సంగీతం సైతం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడీ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాకు ఎవరు సంగీతం అందిస్తారో చూడాలి. 

బోయపాటి దర్శకత్వంలో 'స్కంద'
'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని నటించిన రెండు సినిమాలు... 'రెడ్', 'ది వారియర్' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో 'స్కంద' చేశారు. సెప్టెంబర్ 20న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget