అన్వేషించండి

Double Ismart: 'డబుల్ ఇస్మార్ట్'లో రెండో పాట 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్!

Maar Muntha Chod Chinta Song: ఉస్తాద్ రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లోని 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో రెండో సాంగ్ 'మార్ ముంత చోడ్ చింత' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు.

ఉస్తాద్ హీరో, యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్' (Double Ismart Movie). తనకు 'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)తో ఆ సినిమాకు చేస్తున్న సీక్వెల్ ఇది. ఇందులో రెండో సాంగ్ రిలీజుకు డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. 

జూలై 16న సాయంత్రం 4 గంటల నుంచి!
Watch Maar Muntha Chod Chinta Song Promo: 'డబుల్ ఇస్మార్ట్' నుంచి ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 'స్టెప్పా మార్...' అంటూ రామ్ వేసిన స్టెప్పులు, ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రెండో సాంగ్ 'మార్ ముంత చోడ్ చింత'ను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.

'మార్ ముంత చోడ్ చింత' సాంగ్ ప్రోమోను సోమవారం విడుదల చేశారు. అందులో హీరో రామ్ పోతినేనితో పాటు హీరోయిన్ కావ్య థాపర్ సైతం కనిపించారు. సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో జూలై 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు... అంటే రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్, ఎక్సట్రాడినరీ రీ రికార్డింగ్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ 'డబుల్ ఇస్మార్ట్'కు సైతం సంగీతం అందిస్తున్నారు. ఈ 'మార్ ముంత చోడ్ చింత'కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా... రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ సీపాన, కీర్తనా శర్మ ఆలపించారు. ఆల్రెడీ రిలీజైన ప్రోమో సూపర్ హిట్ అయ్యింది. మరి, సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: తేజుకు అనసూయ రిప్లై... సైలెంట్‌గా ఇచ్చి పడేసిన స్ట్రాంగ్ లేడీ


ఆగస్టు 15న 'డబుల్ ఇస్మార్ట్' గ్రాండ్ రిలీజ్!
Double Ismart Release Date: 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాన్ని పూరి కనెక్ట్స్ పతాకం మీద పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు - ఖల్ నాయక్ సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

Also Readకిరణ్ అబ్బవరం 2.0 - కాంతార రేంజ్‌లో 'క' టీజర్, ఆ విజువల్స్ చూశారా?


Double Ismart Movie Cast And Crew: రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా... సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో అలీ, 'గెటప్' శ్రీను, షాయాజీ షిండే, బనీ జె, మకరంద్ దేశ్ పాండే, 'టెంపర్' వంశీ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కెమెరా వర్క్: సామ్ కె నాయుడు - జియాని గియాన్నెలి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్, వీఎఫ్ఎక్స్: అనిల్ పాదూరి, ప్రొడక్షన్ డిజైనర్: జానీ షేక్, సీఈవో: విష్, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్ - ఛార్మి కౌర్, రచన - దర్శకత్వం: పూరి జగన్నాథ్.

టాప్ హెడ్ లైన్స్

Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ - రజనీ జైలర్ 2తో క్లాష్ తప్పదా?
Maa Inti Bangaram OTT : ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మా ఇంటి బంగారం - సమంత యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget