అన్వేషించండి

Game Changer Movie: ఆ రూమర్స్‌కి చెక్‌ - 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ షూటింగ్, రిలీజ్ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ శంకర్‌

Director Shankar on Game changer: గేమ్‌ ఛేంజర్‌ మూవీపై డైరెక్టర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఓ ఇంటర్య్వూలో రామ్‌ చరణ్‌ మూవీపై స్పందించారు. గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌, రిలీజ్‌ గురించి చెప్పుకొచ్చారు.

Director Shankar Open Up on Game Changer Release: మెగా ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తూ డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కమల్‌ హాసన్‌ 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ జూలై 12న థియేటర్లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన 'గేమ్‌ ఛేంజర్‌' అప్‌డేట్‌ ఇచ్చారు. దీంతో మూవీపై వస్తున్న రూమర్స్‌, అపోహాలకు చెక్‌ పడింది.  

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. ఇంకా రామ్‌ చరణ్‌ మూవీ ఒకటి థియేటర్లోకి రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చరణ్‌ చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్‌ ఇది. మూవీ సెట్స్‌పైకి వచ్చి కూడా ఏడాదిన్నర అవుతుంది. కానీ ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్‌ ఏం రావడం లేదు. ఇక మూవీ కూడా బ్రేక్స్‌ మీద బ్రేక్స్‌ తీసుకుంటూ షూటింగ్‌ని ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ లుక్‌ తప్పితే ఫ్యాన్స్‌ ఆశించిన అప్‌డేట్‌ ఏం రావడం లేదు. దీంతో అసలు గేమ్‌ ఛేంజర్‌ మూవీ ఉందా? క్యాన్సల్‌ చేశారా? అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ దర్శనం ఇస్తున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యాన్స్‌ అంతా 'గేమ్‌ ఛేంజర్‌' విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ గురించి ఏమన్నారంటే..

ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ శంకర్‌ ఇచ్చిన అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు. 'భారతీయుడు 2' మూవీ ప్రమోషన్స్‌లో శంకర్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన శంకర్‌ గేమ్‌ చేంజర్‌ గురించి ఏమన్నారంటే.. మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తయిపోయింది. ఇంకా పది రోజుల షూటింగ్‌ మిగిలి ఉంది. ఇండియన్ 2 మూవీ రిలీజ్‌ అవ్వగానే ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్‌ ఫూటేజ్‌ లాక్‌ చేసి ప్రోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌పై దృష్టి పెడతాను. అన్ని పనులు పూర్తయ్యాక సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది నిర్ణయించి వీలైనంత త్వరగా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తాం" అని పేర్కొన్నారు. స్వయంగా డైరెక్టర్‌ శంకర్‌ గేమ్‌ ఛేంజర్‌ అప్‌డేట్‌ ఇవ్వడంతో ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్ అవుతున్నారు. 

ఇక మూవీ విషయంలో వస్తున్న రూమర్స్‌ అన్నింటికి చెక్‌ పడినట్టు అయ్యింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. అలాగే ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హీరో సిద్ధార్థ్‌ కూడా గేమ్‌ ఛేంజర్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెబుతూ 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా గురించి హింట్ ఇచ్చాడు. 2000 మందితో 'గేమ్ ఛేంజ‌ర్' సినిమా షూటింగ్ జ‌రుగుతుంద‌ని చెప్పడంతో 'గేమ్‌ ఛేంజర్‌' మూవీపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరిష్ గేమ్ ఛేంజర్ ను నిర్మిస్తున్నారు. ఇందులో కియార అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్ జే సూర్య, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: సినిమాని, క్రాఫ్ట్‌ని గౌరవిద్దాం.. దయచేసి థియేటర్లో అలాంటివి చేయకండి - ఆడియన్స్‌కి 'కల్కి' నిర్మాతల రిక్వెస్ట్‌ 

టాప్ హెడ్ లైన్స్

Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
CULT OTT : ఓటీటీలోకి విశ్వక్ #CULT - 20 రోజుల్లోపే మాస్ కా దాస్ వయలెంట్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి విశ్వక్ #CULT - 20 రోజుల్లోపే మాస్ కా దాస్ వయలెంట్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ENE Repeat OTT : ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి 'ENE Repeat' - తరుణ్ భాస్కర్ కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Embed widget