అన్వేషించండి

Akash Puri: పేరు మార్చుకున్న పూరి జగన్నాథ్ తనయుడు - ఇప్పటికైనా కలిసి వచ్చేనా?

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పేరు మార్చుకున్నాడు. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇంతకీ ఆయన పేరు ఎందుకు మార్చుకున్నారంటే..

Actor Akash Puri Change His Name: సినీ నటులు తమ పేర్లను రకరకాలుగా మార్చుకుంటూ ఉంటారు. సినిమా పరిశ్రమలో కొత్తగా ఉండాలని కొందరు, న్యూమరాలజీ ప్రకారం మరికొందరు తమ పేర్లను ఛేంజ్ చేసుకుంటారు. పేర్లకు ముందు, వెనుకా ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇదే కోవలోకి చేరారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. ఆయన పేరును ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నారు. తన బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇకపై తన పేరు ఆకాష్ పూరి కాదని, ఆకాష్ జగన్నాథ్ అని ప్రకటించారు.

పేరు మార్పు ఆకాష్ కు కలిసి వచ్చేనా?

ఆకాష్ తన పేరును ఎందుకు మార్చుకున్నాడు? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. తండ్రి స్టార్ డైరెక్టర్ అయినా, ఆయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన పేరు మార్పు అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆకాష్ పలు సినిమాల్లో నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ పేరు మార్పుతోనైనా కలిసి వచ్చేనా? అని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akash Jagannadh (@actorakashpuri)

చెల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై.. హీరోగా మారి..

ఇక పూరి జగన్నాథ్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆకాష్..  పలు సినిమాల్లో నటించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆయన సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ‘గబ్బర్ సింగ్’, ‘బిజినెస్ మెన్’ లాంటి సినిమాల్లో బాల నటుడిగా కనిపించాడు. 2015లో ‘ఆంధ్రాపోరి’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత ‘మెహబూబా’, ‘రొమాంటిక్’, ‘చోర్ బజార్’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలు ఏవీ ఆయన కెరీర్ కు అనుకున్న స్థాయిలో బూస్టింగ్ ఇవ్వలేకపోయాయి. బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆకాష్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు. పేరు మార్పుతోనైనా ఆకాష్ కెరీర్ ఊపందుకుంటుందేమో చూడాలి.

‘డబుల్ ఇస్మార్ట్’ బిజీలో పూరి జగన్నాథ్

అటు ‘లైగర్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ పోతినేతితో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాస్, యాక్షన్, ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను పూరి కనెక్ట్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న విడుదలకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

Also Read: ‘డెడ్‌పూల్ 3’ టీజర్: మార్వెల్‌కు మహారాజు తానేనట - ‘వోల్వరైన్‌’తో పెట్టుకున్నాడు, ఏమైపోతాడో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget