అన్వేషించండి

Salaar 2 Update : డార్లింగ్ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్ 2 షూటింగ్ ఎప్పుడంటే?

Prabhas Salaar 2 : ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ వచ్చేసింది. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ సలార్ సీక్వెల్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

Director Prashant Neel About Prabhas Salaar 2 Shooting : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా బిగ్ సినిమాల అప్డేట్స్ వరుసగా వచ్చాయి. 'కల్కి సీక్వెల్' దగ్గర నుంచి 'ఫౌజీ' వరకూ మేకర్స్... డార్లింగ్‌కు స్పెషల్ బర్త్ డే విషెష్ చెబుతూనే ఏదో ఒక అప్డేట్ పంచుకున్నారు. తాజాగా, ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'సలార్ 2' అప్డేట్ కూడా వచ్చేసింది. 

ఫన్ పంచ్ విత్ అప్డేట్

'418' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిశారు. డార్లింగ్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన ప్రశాంత్... ఈ మూవీ కంప్లీట్ హారర్ కదా అని ప్రభాస్ అడిగారు. 'అవునన్నా... ఇది కూడా రాధే శ్యామ్‌లా తీస్తే బాగోదు కదన్నా' అంటూ నవ్వులు పూయించారు. దీనికి రియాక్ట్ అయిన ప్రభాస్... 'పంచ్ వేశావా... సలార్ 2 షూటింగ్‌లో నీ సంగతి చెప్తా.' అని అన్నారు. 'సలార్ 2 ఎప్పుడు?. అదే నువ్విచ్చే గిఫ్ట్' అంటూ ప్రభాస్ అడగ్గా... జూన్‌లో 'సలార్ 2' షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

డ్రాగన్ పూర్తైన వెంటనే..

ప్రశాంత్ నీల్ ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్' (Dragon) మూవీ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 11న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ హడావిడి ముగిసిన తర్వాత అంటే జూన్ చివర్లో 'సలార్ 2' షూటింగ్ పనులు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. 'శౌర్యంగ పర్వం' పేరుతో రానున్న ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

Also Read : Ranabaali : రాయలసీమ గడ్డపై పవర్ ఫుల్ వారియర్ - రణబాలికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వరా?... సోషల్ మీడియాలో కొత్త చర్చ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ డ్రామా సలార్ (Salaar : Part 1 - Ceasefire). 2023, డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత, చట్టాలకు అతీతమైన సామ్రాజ్యం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ప్రభాస్ వయలెంట్ యాక్షన్ అదిరిపోయింది.

మూవీలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు, బాబీ సింహా తదితరులు కీలకపాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించారు.

Also Read : Romantic Horror Thriller OTT : ఓటీటీలోకి జీవీ ప్రకాశ్, కయాదు రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanuman Ansh OTT : మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
మూడు ఓటీటీల్లోకి హనుమాన్ అంశ్ - బ్లాక్ బస్టర్ మూవీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
ఆదర్శ కుటుంబం నుంచి అర్థాంతరంగా తప్పించారు... త్రివిక్రమ్ సినిమాపై పూజిత పొన్నాడ సంచలన కామెంట్స్
Sharwanand Dimple Hayathi : శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
శర్వానంద్, డింపుల్‌పై ట్రోలింగ్స్ - డైరెక్టర్ సంపత్ నంది రియాక్షన్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Embed widget