Ajay Shastri: టాలీవుడ్ దర్శకుడు మృతి - మిస్ యూ బాబాయ్ అంటూ మంచు మనోజ్ నివాళులు
Ajay Shastri: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, మంచు మనోజ్ కి ఆప్త మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తుంది.
Director Ajay Shastri Death.. Hero Manchu Manoj Emotional Tweet: టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో మంచు మనోజ్ ప్రకటించారు. అజయ్ శాస్త్రిని మిస్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెట్టారు మనోజ్. మనోజ్ హీరోగా నటించిన 'నేను మీకు తెలుసా?' సినిమాకి అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఏకైక సినిమా అదే. అంతకుముందు ఆయన రచయిగా పనిచేశారు. కాగా.. అజయ్ శాస్త్రి మృతికి కారణం ఏంటో మాత్రం తెలియరాలేదు.
సీనియర్ల దగ్గర వర్క్..
హైదరాబాద్ కి చెందిన అజయ్ శాస్త్రి రచయిగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు. ఎంతోమంది సీనియర్స్ దగ్గర ఆయన వర్క్ చేశారు. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర 'రాఖీ', 'డేంజర్' చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఆ తర్వాత 2008లో మంచు మనోజ్ తో కలిసి 'నేను మీకు తెలుసా?' సినిమా చేశారు. ఆ సినిమాతోనే దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచంయం అయ్యారు ఆయన. ఈ మూవీలో మంచు మనోజ్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించారు. అయితే, ఆ సినిమా ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన టాలీవుడ్ లో ఏ ప్రాజెక్ట్స్ చేయలేదు. ఇక ఇప్పుడు ఆయన మరణవార్త కూడా మనోజ్ ట్వీట్ చేయడంతో బయటికి వచ్చింది.
ఎప్పటికీ ప్రేమిస్తుంటాను బాబాయ్..
మంచు మనోజ్ అజయ్ శాస్త్రిని తలచుకుంటూ ట్వీట్ చేశారు. ఎక్స్ ద్వారా ఆయన నివాళులర్పించారు. అజయ్ శాస్త్రితో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. "నా బెస్ట్ ఫ్రెండ్, నేను మీకు తెలుసా? చిత్రం కెప్టెన్ ఇక లేరు. అజయ్ శాస్త్రి మరణవార్త నా హృదయాన్ని కలచివేసింది. ఆ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. ఈ కష్టకాలంలో అతడి కుటుంబానికి, సన్నిహితులకు మనోధైర్యాన్ని అందించాలని ఆ పరమ శివుడ్ని ప్రార్థిస్తున్నాను. అజయ్ నిన్ను మిస్ అవుతున్నాం రా. మమ్మల్ని విడిచి ఇంత త్వరగా వెళ్లిపోయావ్... నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాం బాబాయ్" అంటూ మంచు మనోజ్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. మరోవైపు దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా అజయ్ శాస్త్రి మరణంపై స్పందించాడు. తనకు అసిస్టెంట్ డైరెక్టరుగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆయనేనని పేర్కొన్నాడు.
Heartbreaking to inform that my best friend and the Captain of Nenu Meeku Telusa is no more. No words can describe the pain we r enduring. Praying lord shiva to give strength to his family and loved ones. Om Shanti.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 2, 2024
Will miss you ra Ajay, gone too soon. Wishing this is a dream.… pic.twitter.com/zxjPjdi2Tw
Also Read: ‘మిస్టర్ బచ్చన్’ లిరికల్ సాంగ్ - రవితేజ, భాగ్యశ్రీ రొమాన్స్ చూస్తే.. లవ్‌లో పడిపోతారు!