అన్వేషించండి

Aha : సింగిల్ టేక్‌లో ఒక రీల్‌కు సరిపడా సీన్ - జగపతిబాబు ఆహా సినిమాలో ఈ అద్భుతం ఎలా జరిగిందో తెలుసా?

Aha Single Take Shot : జగపతిబాబు హీరోగా వచ్చిన ఆహా సినిమాలో ఓ సీన్ కట్స్ లేకుండా పది నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ ను ఎలా చేశారో.. అప్పట్లో కో డైరక్టర్‌గా పని చేసిన దేవీప్రసాద్ సోషల్ మీడియాలో వివరించారు.

Aha Movie Special Single Take Shot : జగపతిబాబు హీరోగా వచ్చిన ఆహా సినిమా మంచి విజయం సాధించింది. రఘువరన్, జయసుధ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాలో ఓ సీన్ దాదాపుగా పది నిమిషాల పాటు కట్స్ లేకుండా సాగుతుంది. ఆ సీన్ ను షూట్ చేయడం ఆషామాషీ కాదు. ఎలా చేశారో ఇప్పటికీ ఓ అద్భుతమే. అలా ఎలా చేయగలిగారో.. ఆ సినిమా  కో డైరక్టర్ గా పని చేసిన దేవీప్రసాద్ సోషల్ మీడియాలో వివరించారు. ఆయన పోస్టు వైరల్ అవుతోంది. 

ఆహా సినిమాలో అతి పెద్ద సీన్  
  
"హీరో తన ప్రేమ గురించి బాధపడుతుంటే తల్లి(అన్నపూర్ణ),వదిన(జయసుధ),బామ్మ,తాత,అందరూ తాము తండ్రి(విజయకుమార్)ని ఒప్పిస్తామని చెప్పటం, అప్పుడేవచ్చిన ఆయనకి హీరో ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడని అబద్ధం చెప్పటం, ఈలోగా అమ్మాయి తండ్రి(చంద్రమోహన్)సంబంధం మాట్లాడటానికి రావటం, కొంత చర్చ తరువాత అతను కేవలం వంటవాడని తెలిసి హీరో తండ్రి తిట్టడం, వాళ్ళిద్దరిమధ్య ఘర్షణ, అతను వెళ్ళాక తండ్రి కొడుకుని తిట్టడం, హీరోని వదిన ఓదార్చివెళ్ళాక అన్న(రఘువరన్)ఇంట్లోకి రావటం, ఫోన్ రింగ్ అయితే హీరో లిఫ్ట్ చేస్తే అవతలనుండి ఓ ఆడగొంతు అన్నయ్యగురించి అడగటం, ఫోన్ తీసుకున్న అన్నయ్య సార్ సార్ అంటూ మాట్లాడి అర్జెంట్ మీటింగ్ ఉందని తిరిగి వెళ్ళిపోవటం, తండ్రి అన్నయ్యని చూసైనా నేర్చుకో అని తిట్టడం, అన్నయ్య అబద్ధం ఎందుకు చెప్పాడు అని హీరో ఆలోచించడం" ఇదంతా సినిమాలో ఒక రీల్ కి సరిపోయేంత లెంగ్త్ ఉన్న సన్నివేశం. 

మొదటి సారి చేసింది రీల్ పాడైపోయింది !  

సాధారణంగా ఏ దర్శకులైనా ఆ సన్నివేశాన్ని ఎన్నో షాట్స్ గా విభజించి చిత్రీకరణ జరుపుతారు. కానీ దర్శకుడు సురేష్ కృష్ణ మాత్రం  మొత్తం సింగిల్ షాట్‌లో చిత్రీకరించాలనుకున్నారు. అదీ "స్టడీ క్యాం"లాంటివి ఉపయోగించకుండా కేవలం ట్రాక్&ట్రాలీ తో.అప్పటికి "గింబల్" రాలేదని దేవీప్రసాద్ గుర్తు చేసుకున్నారు.  అసిస్టెంట్‌డైరెక్టర్స్‌ని,కెమేరా అసిస్టెంట్స్‌ని,ఆర్ట్ అసిస్టెంట్స్‌ని నటీనటుల స్థానాలలో సెట్లో అటూఇటూ నడిపిస్తూ ఎప్పుడెవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెబుతూ,ఏ టైంలో కెమేరా ఎక్కడెక్కడికి వెళ్ళాలో,ఎక్కడిదాకా వెళ్ళాక క్రింద పడుకుని వుండే ట్రాక్&ట్రాలీ డిపార్ట్‌మెంట్‌వాళ్ళు క్రింద ట్రాక్ సైలెంట్‌గా పీకేసి దానికి రౌండ్‌ట్రాలీ ఎలా ఫిక్స్ చెయ్యాలో అంతా క్లియర్‌గా వివరిస్తుంటే మతిపోయింది అందరికీ.  ఆయన షాట్ కంపోజిషన్ అద్భుతం.   నటీనటులైతే విషయం చెప్పగానే అమ్మో సాధ్యమా అన్నారని..  "మీరేం కంగారుపడకండి. మీరు ప్రిపేర్ అవ్వండి. దేవీ మొత్తం డైలాగ్స్ ప్రాంప్ట్ చేస్తాడు"అన్నారని దేవీప్రసాద్ పోస్టులో వివరించారు. 

స్పెషల్‌గా బోంబే నుండి 1000 ఫీట్ క్యాన్  

అప్పట్లో డిజిటల్ కాదు. మానిటర్స్ లేవు. అప్పట్లో షూట్‌చేసే నెగెటివ్ క్యాన్‌లో 400 అడుగులు నెగెటివ్ మాత్రమే ఉంటుంది. స్పెషల్‌గా బోంబే నుండి 1000 ఫీట్ క్యాన్ తెప్పించారని దేవీ ప్రసాద్ తెలిపారు.  ఉదయం 9 గంటలకు నటీనటులని మేకప్ లేకుండా రమ్మని సెట్ లో కెమేరాతో సహా అన్ని కదలికలనూ వివరించారు డైరెక్టర్. వెళ్ళి మధ్యాహ్నం 4 గంటలకు మేకప్ తో రమ్మన్నారు.ఈ లోపు సెట్ అంతా లైటింగ్ చేశారు కెమేరామెన్ శరవణన్. మధ్యాహ్నం నటీనటులు రాగానే ఒక్కసారి రిహార్సల్ చేసి టేక్ అన్నారు.  నటీనటులందరూ ప్రాప్టింగ్ చేయాల్సిన నావైపు నీదే భారం అన్నట్లు చూస్తుంటే టెన్షన్ వచ్చేసింది.షాట్ మధ్యలో ఎక్కడ ఆగినా 1000 అడుగుల నెగెటివ్ వేస్ట్ అయిపోతుంది. డైరెక్టర్‌  యాక్షన్ అనగానే యజ్ఞం మొదలైంది. ఎవరిపని వాళ్ళు కరెక్ట్ గా చేశారు. ఫిల్మ్ 892 అడుగులు తిరిగాక సీన్ పూర్తయ్యి డైరెక్టర్‌ కట్ అని అరిచారు. ఓకే అనగానే చప్పట్లు మారుమ్రోగాయి.  అప్పటికప్పుడు ల్యాబ్ కి వెళ్ళింది నెగెటివ్.    1000 ఫీట్ క్యాన్స్ వాడకంలో లేకపోవటం వల్ల ఆ నెగెటివ్ ఫాగ్ అయ్యి ప్రింట్ పైన మచ్చలువచ్చాయని ల్యాబ్ రిపోర్ట్.   మరొక దర్శకుడైతే మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోరు. కానీ ఆయన సురేష్‌కృష్ణ. నో కాంప్రమైజ్. మళ్ళీ అందరినీ మోటివేట్ చేసి అదేతరహా చిత్రీకరణకి సిద్ధమయ్యారు.  బోంబే ల్యాబ్ వాళ్ళు ఈసారి 1000 ఫీట్ క్యాన్ చెక్ చేసిమరీ ఫ్రీగానే పంపారు.  రెండోసారి అందరూ టెన్షన్ పడకుండానే చేశారు. ఇప్పుడా షాటే సినిమాలో ఉన్నదని దేవీ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.


  
"సినిమాలో ఓ షాట్ చిత్రీకరణ జరిగిందంటే అది చరిత్రలో శాస్వతంగా నిలిచిపోతుంది మళ్ళీ మార్పుచేర్పులుండవు"అనే స్పృహని ఎల్లప్పుడూ కోల్పోకుండానే ఉంటారు గొప్ప దర్శకులు.  ఆయనే "భాషా" సినిమాలో రజనీకాంత్‌తో "నేనొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు" అనే డైలాగ్ చెప్పించినట్లు "సురేష్‌కృష్ణ  తో నేనొక్క సినిమాకే పనిచేసినా అది వందసినిమాలకు సమానం"...అని దేవీప్రసాద్ గురువుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఆ సీన్ ను యూట్యూబ్‌లో చూడవచ్చు. దేవీప్రసాద్ తర్వాత దర్శకుడిగా మారి పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు నటుడిగా కూడా మారారు. 

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget