అన్వేషించండి

చిత్ర సీమలో విషాదం - గుండెపోటుతో 'ధూమ్' డైరెక్టర్ మృతి!

Director Sanjay Gadhvi : 'ధూమ్', 'ధూమ్ 2' సినిమాలను డైరెక్ట్ చేసిన బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గాద్వి గుండెపోటుతో మరణించారు.

Dhoom Director Sanjay Gadhvi Passed Away : చిత్ర సీమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడి మృతితో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలీవుడ్ లో 'ధూమ్'(Dhoom) 'ధూమ్ 2'(Dhoom 2) లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్ గాద్వి(Sanjay Gadhvi) గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం..

సంజయ్ గాద్వి ఆదివారం రోజు ఉదయం లోకండ్ వాలా బ్యాక్ రోడ్ లో మార్నింగ్ వాక్ చేస్తుండగా గుండె నొప్పికి గురయ్యారు. దీంతో ఆయన్ని వెంటనే కొకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజయ్ గాద్వి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజయ్ గాద్వి వయసు 56 సంవత్సరాలు మాత్రమే. మరో మూడు రోజుల్లో ఆయన పుట్టినరోజు ఉండడం, ఈ లోపే ఆయనకు గుండెపోటు రావడం కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా కలచి వేస్తోంది. ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా సంజయ్ గాద్వి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆయన కుటుంబం విషయానికొస్తే.. సంజయ్ గాద్వికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి మల్టీప్లెక్స్ లో సినిమాలు కూడా చూశారని సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ గాద్వి దర్శకుడిగా 2000 వ సంవత్సరంలో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆ సంవత్సరంలో 'తేరే లియే'(Tere liye) అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ బడ్జెట్ కారణాలవల్ల ఆయన తొలి చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ తో చేతులు కలిపి 'ధూమ్','(Dhoom) 'ధూమ్ 2' '(Dhoom 2) వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు తెరకెక్కించి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధూమ్'(Dhoom) 2004లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన 'ధూమ్ 2'(Dhoom 2) సైతం బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 2013 లో వచ్చిన 'ధూమ్ 2' లో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్ లతోపాటు అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటించారు. ఈ రెండు సినిమాలతో యాక్షన్ చిత్రాలకు కొత్త అర్థం చెప్పారు సంజయ్. ధూమ్ సిరీస్ తో ఇండియన్ యాక్షన్ సినిమాలు కొత్త మలుపు తీసుకున్నాయి. అలాంటి సినిమాలు అప్పటివరకు హాలీవుడ్ లో మాత్రమే సాధ్యమయ్యేవి. కానీ సంజయ్ గాద్వి ధూమ్ సిరీస్ తో ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ని క్రియేట్ చేశారు. ఈ రెండు సినిమాలతో పాటు 'మేరే యార్ కి షాదీ హై', 'కిడ్నా ప్', 'ఆజాద్ గజబ్ లవ్', 'ఆపరేషన్ పరిందే' వంటి సినిమాలను సైతం డైరెక్ట్ చేశారు.

Also Read : సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టిన నాగ చైతన్య - ఖాళీగా ఉండటం వల్లే అంటూ కామెంట్స్!

టాప్ హెడ్ లైన్స్

Payal Rajput : అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
అలా అయితే డోంట్ సబ్ స్క్రైబ్ - పాయల్ ఇన్ స్టా పోస్ట్ వైరల్
Agadha Release Date : గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
గెట్ రెడీ ఫర్ సూపర్ థ్రిల్... అగధ వచ్చేస్తోంది - వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్ ఫిక్స్
Lenin: అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
అఖిల్ అక్కినేని ఒక్కడికే కాదు... భాగ్యశ్రీ బోర్సేకీ 'లెనిన్' సక్సెస్ ఇంపార్టెంటే
Trikala OTT : ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల
ఆ ఊరిలో అమ్మవారికి ముడుపు కడితే? - ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ త్రికాల

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget