అన్వేషించండి

D51 Title Look: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్‌ ఇండియా మూవీ టైటిల్‌ ఇదే - ఆసక్తి పెంచుతున్న హీరో లుక్‌

D51 Title Look: శివరాత్రి సందర్భంగా ధనుష్‌-శేఖర్ కమ్ముల మూవీ నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది.తాజాగా ఈ సినిమాలోని ధనుష్‌ లుక్‌తో పాటు మూవీ టైటిల్‌ను ప్రకటించారు మేకర్స్‌

Dhanush-Shekar Kammula Movie Title Fix: కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడే. డబ్బింగ్‌ చిత్రాలతో ఇక్కడి ఆడియన్స్‌ని దగ్గరైన ధనుష్‌ తెలుగు స్ట్రయిట్‌ చిత్రం సార్‌తో టాలీవుడ్‌ హీరో కూడా అయిపోయాడు. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తూనే మరో తెలుగు డైరెక్టర్‌తో జతకట్టిన సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో ధనుష్‌ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంతో ఓ సినిమా తెరకెక్కుతోంది. పాన్‌ ఇండియా వస్తున్న ఈ సినిమాపై ప్రకటనతో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక స్టార్‌ కాస్ట్ ప్రకటనతో అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంట్రెస్టింగ్ గా టైటిల్ అండ్ లుక్

ఇక ఈ ఏడాదిలో ప్రారంభంలో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా మూవీ టీం ఆసక్తికర అప్‌డేట్‌ వదిలింది. తాజాగా ఈ సినిమాలోని ధనుష్‌ లుక్‌తో పాటు మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు 'కుబేర' టైటిట్‌ ఫిక్స్ చేసి తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌, మూవీ టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఈ టైటిల్‌, హీరో లుక్‌కి అసలు సంబంధం లేకుండ ఉంది. దీంతో మూవీపై స్టోరీ ఏంటనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టైటిల్‌ చూస్తే కుబేర అని ఉంది, కానీ ధనుష్‌ లుక్‌ మాత్రం పూర్‌గా ఉంది. దీంతో ఈ టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై అంచనాలు పెంచెస్తోంది.
D51 Title Look: ధనుష్, శేఖర్ కమ్ముల పాన్‌ ఇండియా మూవీ టైటిల్‌ ఇదే - ఆసక్తి పెంచుతున్న హీరో లుక్‌

నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో... సోనాల్ నారంగ్ సమర్పణలో శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి. సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరిలో పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ అయిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ని జరపుకుంటుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఒకేసారి ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడలో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియాగా రాబోతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మూవీ సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌, ఇతర నటీనటులపై ప్రకటన రానుంది. 

రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత...

'ఫిదా', 'లవ్ స్టోరీ'... రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతి హిట్ 'నా సామి రంగ' తర్వాత నాగార్జున, తమిళంలో పొంగల్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్' తర్వాత ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. రామకృష్ణ & మౌనిక దంపతులు ప్రొడక్షన్ డిజైనర్లుగా వ్యవహరిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget