అన్వేషించండి

Dhanush Mrunal Thakur : ధనుష్, మృణాల్ పెళ్లి చేసేశారు? - అతిథులుగా స్టార్ హీరోస్... మరీ ఇలా ఉన్నారేంట్రా!

Dhanush Mrunal Wedding : కోలీవుడ్ స్టార్ ధనుష్, మృణాల్ ఠాకూర్‌ల వివాహాన్ని ఓ నెటిజన్ చేసేశాడు. ఇద్దరి పెళ్లి స్టార్ హీరోల సమక్షంలో జరిగినట్లు AI వీడియో క్రియేట్ చేశాడు.

Dhanush Mrunal Thakur Wedding AI Video : కోలీవుడ్ స్టార్ ధనుష్, మృణాల్ ఠాకూర్ లవ్, డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందంటూ కొన్ని ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రచారాన్ని మృణాల్ ఖండించారు. ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు సందర్భాల్లో చెప్పారు. ఆమె టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసినా వీరిద్దరిపై నెట్టింట రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

ధనుష్, మృణాల్ పెళ్లి వీడియో?

ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తున్న క్రమంలో యూజర్లు తమకు నచ్చిన విధంగా హీరోలు, హీరోయిన్లతో ఫోటోలు క్రియేట్ చేస్తున్నారు. కొందరు ఫన్ వీడియోలు క్రియేట్ చేస్తుండగా మరికొందరు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా... ధనుష్, మృణాల్‌ల పెళ్లి చేసేశారు నెటిజన్లు. ఓ నెటిజన్ వీరిద్దరి పెళ్లి అంటూ AI వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

అర్చకులు వేద మంత్రాలు చదువుతుండగా... మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా ధనుష్, మృణాల్ పెళ్లి జరిగినట్లుగా వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వేడుకకు తమిళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ దళపతి విజయ్, అజిత్, త్రిష, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్, అనిరుధ్ తదితరులు హాజరైనట్లు కూడా క్రియేట్ చేశారు. ఇది ఫేక్ వీడియోనే అయినా చాలా మంది బాగుంది అంటూ షేర్ చేస్తున్నారు.

Also Read : విజయ్ దేవరకొండ, రష్మిక హ్యాట్రిక్ మూవీ - పవర్ ఫుల్ టైటిల్ అదేనా?

అసలెందుకీ రూమర్స్?

తలైవా రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్యతో ధనుష్ మొదటి వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2022లో వీరిద్దరూ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ ఒంటరిగానే ఉంటాడు. ఈ క్రమంలోనే మృణాల్‌తో లవ్, డేటింగ్ పుకార్లు హల్చల్ చేశాయి. బాలీవుడ్‌లో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్నాఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది.

అంతకు ముందు ధనుష్ 'తేరే ఇష్క్ మే' షూటింగ్ ఫినిష్ అయిన సందర్భంగా ఇచ్చిన పార్టీకి మృణాల్ అటెండ్ కావడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే, ధనుష్ సోదరీమణులను మృణాల్ ఇన్ స్టాలో ఫాలో అవుతుండడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే డేటింగ్, రిలేషన్, పెళ్లి అంటూ వార్తలు హల్చల్ చేశాయి. ఫిబ్రవరి 14న వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పటివరకూ దీనిపై అటు ధనుష్ టీం కానీ, ఇటు మృణాల్ టీం కానీ అఫీషియల్‌గా రియాక్ట్ కాలేదు. గతంలో మృణాల్ టీం రిలేషన్ షిప్ రూమర్స్‌ను తీవ్రంగా ఖండించింది. వాటిల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి గాయం... NBK111 షూట్‌లో ప్రమాదం - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి గాయం... NBK111 షూట్‌లో ప్రమాదం - లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్
కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget