బాస్ లేడీ లుక్‌లో వావ్ అనిపిస్తున్న మృణాల్! ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఆమె బాస్ లేడీలా వావ్ అనిపిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఈ ఫొటోలు పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ లైకులు, కామెంట్లతో చెలరేగిపోతున్నారు. 2022లో వచ్చిన ‘సీతా రామం’ అనే సినిమాతో మృణాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో సీత పాత్రలో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’లో యష్ణ పాత్రలో కనిపించారు. ఈ పాత్రకు కూడా ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ నిరాశపరిచింది. ‘కల్కి 2898 ఏడీ’లో కూడా ఒక మంచి క్యామియో రోల్‌లో మృణాల్ కనిపించారు.