అన్వేషించండి

Devil Movie Songs : 'డెవిల్'లో సిద్ శ్రీరామ్ పాట మాయే చేసి - చూశారా కళ్యాణ్ రామ్, సంయుక్త జోడీ కెమిస్ట్రీ?

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ఇందులో తొలి పాట 'మాయే చేసి...'ను ఈ రోజు విడుదల చేశారు.  

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'డెవిల్' (Devil Indian Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ కథానాయిక. ఇంతకు ముందు 'బింబిసార'లో కళ్యాణ్ రామ్, సంయుక్త జంటగా నటించారు. వాళ్ళ కలయికలో రెండో చిత్రమిది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై తెరకెక్కించిన 'మాయ చేసే...' పాటను ఈ రోజు విడుదల చేశారు. 

సిద్ శ్రీరామ్ పాడిన 'మాయే చేసి'
'డెవిల్'కు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ 'రావణాసుర', దుల్కర్ సల్మాన్ 'కనులు కనులు దోచాయంటే'తో పాటు 'జార్జ్ రెడ్డి' తదితర చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. 'అర్జున్ రెడ్డి'కి నేపథ్య సంగీతం చేశారు. 

'డెవిల్' కోసం హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన బాణీకి సత్య ఆర్వీ సాహిత్యం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 

'మాయే చేసి మెల్లగా...
మది దోచేసిందే సిన్నగా!
చూపే చూసి సన్నగా...
నను చంపేసిందే సూటిగా!
ఒక నవ్వే నవ్వి నేరుగా...
గుండెలనే పిండేసిందిగా!''అంటూ ఈ పాట సాగింది. ఇందులో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది.  

మాంచి మెలోడీగా 'మాయే చేసి...' పాటను రూపొందించారు. ఈ పాట వింటున్న సమయంలో ప్రేక్షకులు అందమైన అనుభూతికి లోనయ్యేలా ఉంది. 'డెవిల్' కథా నేపథ్యానికి మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలాన్ని ఎంచుకున్నారు. ఈ పాటలు, సన్నివేశాలు కూడా రెట్రో నేపథ్యంలో ఉంటాయి. కాస్ట్యూమ్స్ నుంచి లొకేషన్స్, బ్యాక్ గ్రౌండ్ వరకు ప్రతి విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు.

Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్

నవంబర్ 24న 'డెవిల్' విడుదల!
ఆల్రెడీ 'డెవిల్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Also Read : అమ్మాయి సముద్రం ఆ అబ్బాయే, ప్రేమ నుంచి జైలు వరకు - తెలుగులో కన్నడ బ్లాక్‌బస్టర్ ట్రైలర్  

శ్రీకాంత్ విస్సా అందించిన కథతో...
'డెవిల్'కు శ్రీకాంత్ విస్సా కథ, మాటలు అందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప'కూ ఆయన పని చేశారు. ఇంకా ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌంద‌ర్ రాజన్‌ .ఎస్, సంగీతం : హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్.  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

72nd National Award Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ - కంప్లీట్ లిస్ట్... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
National Awards Telugu Movies OTT : నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
నేషనల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీస్ - ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Chennai Love Story Trailer : తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
తొలి ప్రేమ అంత తోపేం కాదు - సముద్ర తీరంలో స్టార్ట్ అయిన చెన్నై లవ్ స్టోరీ
Varanasi Glimpse : వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?
వారణాసి నుంచి మరో సర్ప్రైజ్ - ఆ రోజున విజువల్ వండర్ గ్లింప్స్ రిలీజ్?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Embed widget