Devil Movie: ‘డెవిల్’ మూవీలో ‘మాయే చేసే’ పాట గ్లింప్స్ విడుదల - కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య అందమైన ప్రేమకథ!
‘బింబిసార’ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ కోసం కళ్యాణ్ రామ్ ఎదురుచూస్తున్నారు. అందుకే మళ్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయిన ‘డెవిల్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
తెలుగులో మెలోడీ పాటలు పాడాలన్నా... ఏదైనా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పినా... ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు సిద్ శ్రీరామ్. నందమూరి కళ్యాణ్ రామ్ అప్‌కమింగ్ మూవీ ‘డెవిల్’ నుండి మొదటి పాటకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ మెలోడీ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ పర్ఫెక్ట్ పెయిర్‌లాగా అనిపిస్తున్నారని అప్పుడే ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ గ్లింప్స్‌లో ప్రకటించారు మేకర్స్.
డెవిల్ - బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్..
ఇప్పటికే ‘బింబిసార’లాంటి చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్... మరోసారి అలాంటి హిట్ కోసమే పాటు పడుతున్నాడు. భారీ బడ్జెట్‌తో, అత్యంత నమ్మకంతో తెరకెక్కిన ‘బింబిసార’ హిట్ అవ్వడంతో తన తరువాతి సినిమాల విషయంలో కూడా బడ్జెట్ దగ్గర ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదని కళ్యాణ్ రామ్ డిసైడ్ అయినట్టుగా అనిపిస్తోంది. అలా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ చిత్రమే ‘డెవిల్ - బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్... ఒక స్పైగా నటిస్తున్నాడన్న విషయం మూవీ టీమ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.
గోల్డెన్ లెగ్ సంయుక్త మీనన్..
‘డెవిల్’ లాంటి ఒక స్పై థ్రిల్లర్ మూవీ నుండి మొదటిగా ఒక మెలోడీ సాంగ్‌ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. ఇక తాజాగా దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి పాట ‘మాయే చేసే’ గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ పెయిర్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరు కలిసి ‘బింబిసార’లో హీరో హీరోయిన్లుగా కనిపించారు. ఆ మూవీలో సంయుక్త రోల్ కాసేపే కావడంతో కనీసం ‘డెవిల్’లో అయినా పూర్తిస్థాయి రోల్ ఉండాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక తెలుగులో నాలుగు సినిమాలు చేయగా.. ఆ నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్ అవ్వడంతో సంయుక్తను గోల్డెన్ లెగ్‌గా భావిస్తున్నారు మేకర్స్.
Also Read : షారుఖ్ ఖాన్ కోసం దీపికా పదుకోన్ ఫ్రీగా నటించారా?
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘డెవిల్’ సినిమాను భారీ బడ్జెట్‌తో దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 19న ‘మాయే చేసే’ పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ వీడియో విడుదల అవుతుందని గ్లింప్స్‌లో చెప్పేశారు మేకర్స్. సిడ్ శ్రీరామ్ పాడిన పాట కాబట్టి వెంటనే ఛార్ట్‌బస్టర్ అవుతుందని మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. ఇప్పటివరకు ‘డెవిల్’ అంటే కేవలం థ్రిల్లర్ మాత్రమే అనుకున్న ప్రేక్షకులకు.. ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా ఉందని పాట ద్వారా అర్థమయ్యేలా చేస్తున్నారు మేకర్స్. ‘బింబిసార’లో కలిసి నటించినా కూడా కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందని ప్రేక్షకులు చూడలేకపోయారు. కనీసం ‘డెవిల్’లో అయినా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
Also Read: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కోటి రూపాయల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial