అన్వేషించండి

KBC 15: 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కోటి రూపాయల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా?

'కౌన్ బనేగా కరోడ్‌పతి' లేటెస్ట్ ఎపిసోడ్ లో కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కంటెస్టెంట్. జపాన్ లో అణుబాంబు దాడికి సంబంధించిన ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకనే  రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ఈ షోను దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ క్విజ్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు, వాళ్లు చెప్పే సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 15వ సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో పంజాబ్ కు చెందిన జస్కరన్ సింగ్ రూ. కోటి గెలుచుకుని సత్తా చాటారు. తాజాగా ఈ షోలో పాల్గొన్న ఇండోర్‌ యువకుడు  శుభమ్ గ్యాంగ్రేడే కూడా రూ. కోటి గెలుచుకుంటాడని అందరూ భావించారు. కానీ, కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. రూ. 50 లక్షలు తీసుకుని షో నుంచి వెనుదిరిగాడు.   

ఇంతకీ కోటి రూపాయల ప్రశ్న ఏంటంటే?

'కౌన్ బనేగా కరోడ్‌పతి' తాజా సీజన్ లో శుభమ్ సమాధానాలు చెప్పే విధానాన్ని చూసి కచ్చితంగా రూ.కోటి కొల్లగొట్టడం ఖాయం అనుకున్నారు. కానీ, అమితాబ్ అడిగిన రూ. కోటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు. హిరోషిమా బాంబు పేలుళ్లకు సంబంధించిన ప్రశ్నకు ఆయన ఆన్సర్ చెప్పలేకపోయారు. తొలి ప్రశ్న నుంచే శుభమ్ చక్కగా సమాధానాలు చెప్పారు. అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేసిన ఆయన కోటి రూపాయలకు సంబంధించిన 14వ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయారు. జపాన్‌లోని హిరోషిమాపై వేసిన మొదటి అణు బాంబు గురించి ఈ ప్రశ్న అడిగారు. ఆగస్టు 6, 1945న హిరోషిమాపై మొదటి అణు బాంబును వేసిన విమానానికి ఏ పేరు పెట్టారు? అనేది క్వశ్చన్. కానీ ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఫైలెట్ తల్లి పేరును(ఎనోలా గే) సదరు విమానానికి పెట్టినట్లు బిగ్ బీ వెల్లడించారు. దీంతో రూ. 50 లక్షలతో శుభమ్ షో నుంచి వెళ్లిపోయారు.  

వరుస సినిమాలతో బిగ్ బీ ఫుల్ బిజీ

అమితాబ్ బచ్చన్ చివరిసారిగా అనుపమ్ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్ ఇరానీలతో కలిసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ‘ఉంచై’లో కనిపించారు. సూరజ్ బర్జాత్యా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల మంచి ఆదరణ లభించింది. అటు ప్రభాస్ హీరో,  దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ‘ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్, గ్లింప్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  అటు రిభు దాస్‌గుప్తా  తెరకెక్కించనున్న కోర్ట్‌ రూమ్ డ్రామా ‘సెక్షన్ 84‘లోనూ నటించనున్నారు. ఇవాళ్టి( శుక్రవారం) KBC ఎపిసోడ్‌లో విక్కీ కౌశల్, మానుషి చిల్లర్ పాల్గొననున్నారు. తమ రాబోయే చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ‘ని ఈ షో వేదికగా ప్రమోట్ చేయనున్నారు.

Read Also: టాలీవుడ్‌లోకి ‘సైరత్‘ బ్యూటీ - ఆ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 13th: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
పొదరిల్లు: గాయత్రి పెళ్లి చూపులు జరిగాయా...? మహా వాళ్ల వదినను ఎందుకు కలిసింది..?
Gunde Ninda Gudi Gantalu March 13th Episode: రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
రోహిణి మనోజ్ కొత్త మోసం, చిన్న గంప పెళ్లిసందడిలో బాలు మీనా - గుండెనిండా గుడిగంటలు మార్చి 13 ఎపిసోడ్
Telugu TV Movies Today: మార్చి 13, శుక్రవారం... తెలుగు టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే
మార్చి 13, శుక్రవారం... తెలుగు టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే
Lakshimi Raave Maa Intiki Serial Today March 12th: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: యాక్సిడెంట్ కేసులో మ్యాడీకి దొరికిన కీలక ఆధారాలేంటి..? మ్యాడీపై దాడి చేసి కిడ్నాప్ చేసిందెవరు...?

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttam Kumar Reddy: తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
తగినంత స్టాక్ అందుబాటులో.. LPG సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Madhavi Latha Iftar Flexis: MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
MIM ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేసిన మాధవీలత, హైదరాబాద్‌లో అగ్గి రాజేశారా !
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CNG Shortage In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
హైదరాబాద్‌లో పెరిగిన సీఎన్జీ కష్టాలు, కిలోమీటర్ల మేర భారీ క్యూ లైన్లలో వాహనాలు
Kadapa Crime News: ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి.. భార్యకు చెబుతూ సూసైడ్ వీడియో రికార్డు చేసిన భర్త !
LPG Gas Booking : గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలా? HP, Indane, Bharat గ్యాస్ వినియోగదారులు WhatsApp, SMS, కాల్ ద్వారా ఇలా బుక్ చేయండి
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Embed widget