అన్వేషించండి

Dear Uma Teaser: అమ్మాయిల ప్రేమ స్వార్థంలోనే ఉంటుందా? తెలుగులో మరో పొయెటిక్ లవ్ స్టోరీ

Sumaya Reddy's Dear Uma movie: తెలుగమ్మాయి సుమయా రెడ్డి కథానాయికగా నటిస్తూ, నిర్మిస్తున్న సినిమా 'డియర్ ఉమ'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేశారు.

Pruthvi Ambaar and Sumaya Reddy's Dear Uma teaser review: 'అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉంటుంది. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది' అని యువ కథానాయకుడు పృథ్వీ అంబర్ అంటున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'డియర్ ఉమ' సినిమా టీజర్‌లో డైలాగ్ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

సుమయా రెడ్డి నటిస్తూ నిర్మించిన సినిమా
తెలుగు చిత్రసీమకు మరో తెలుగు అమ్మాయి కథానాయికగా పరిచయం అవుతోంది. ఆమె పేరు సుమయా రెడ్డి. కథానాయికగా తన తొలి చిత్రాన్ని ఆమె స్వయంగా నిర్మించడం విశేషం. సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన సుమయా రెడ్డి... ఆ బ్యానర్ మీద 'డియర్ ఉమ' ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా 'దియ' సినిమా ఫేమ్ పృథ్వీ అంబర్ నటిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, అందించడంతో పాటు డైరెక్షన్ చేస్తున్నారు. నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టీజర్ విడుదల చేశారు. 

కవితాత్మకంగా సాగిన 'డియర్ ఉమ' టీజర్
'డియర్ ఉమ' టీజర్ కవితాత్మకంగా సాగింది. తొలుత హీరోని లూజర్ అన్నట్లు ప్రాజెక్ట్ చేశారు. అతనో మ్యుజిషియన్. గిటార్ ప్లే చేస్తూ... పాటలు పాడుతూ ఉంటాడు. పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి స్టేజి ఎక్కిన ప్రతిసారీ 'గెట్ అవుట్' అనే ఛీత్కారాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత అతనికి ఉమ పరిచయం అవుతుంది.

Also Read: ఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?

'నా కణాల్లో జీవం నీ కళ్లు... నా నరాల్లో ప్రవాహాం నీ చూపు', 'ప్రేమ అనేది ఓ అనిర్వచనీయమైన నిర్వచనం' వంటి మాటలు బావున్నాయి. విజువల్స్, డైలాగ్స్ చూస్తే... కవితాత్మక ప్రేమ కావ్యంగా అనిపిస్తోంది. బ్రేకప్ తర్వాత 'అమ్మాయిలు ఇచ్చే షాక్‌లకు అబ్బాయిలకు ఇదే సరైన మెడిసిన్' డైలాగ్ గానీ టీజర్ ఎండింగ్ విజువల్స్ గానీ 'డియర్ ఉమ'లో డెప్త్ ఉందని అర్థం అవుతోంది.

Also Readఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!

''ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అందమైన ప్రేమకథతో పాటు చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాం. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని సుమయా రెడ్డి చెప్పారు.

సుమయా రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్న 'డియర్ ఉమ' సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రూప లక్ష్మీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత: సుమయ రెడ్డి, దర్శకుడు: సాయి రాజేష్ మహాదేవ్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget