Hero Darshan: రేణుకా స్వామి చనిపోయాడనుకోలేదు... ఇంటికి వచ్చాకే విషయం తెలిసింది - ఛార్జ్ షీట్‌లో దర్శన్
Hero Darshan: రేణుకా స్వామి హత్యకు సంబంధించి హీరో దర్శన్ సంచలన విషయాలు చెప్పారు. అసలు ఏం జరిగిందో వివరించారు. ఈ మేరకు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.
Darshan confesses to 'kicking' Renukaswamy twice on head: కన్నడ నాట సంచలనం సృష్టించిన కేసు రేణుకా స్వామి హత్య. తన ప్రేయసి, నటి పవిత్రకు అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నాడనే కోపంతో అభిమానిని హీరో దర్శన్ కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతను మరణించాడు. ఆ కేసులో దర్శన్, నటి పవిత్ర గౌడ, మరో 15 మంది జైల్లో ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పోలీస్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్ విచారణలో సంచలన విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని కోర్టులో అందజేశారు. ఆ ఛార్జ్ షీట్ లో రేణుకా స్వామిని ఎలా కొట్టారు? అసలు ఏం జరిగిందో వివరించాడు.
ఛార్జ్ షీట్ లో ఏముందంటే?
పోలీసులు కోర్టులో ఇచ్చిన ఛార్జ్ షీట్ లో దర్శన్ స్టేట్ మెంట్ క్లియర్ గా ఉంది. రేణుకా స్వామి చనిపోక ముందు ఏం జరిగిందో చాలా స్పష్టంగా చెప్పాడు దర్శన్. "నేను అతన్ని నా చేతితో గట్టిగా కొట్టాను. ఆ తర్వాత కాలితో తన్నాను. పవిత్ర గౌడను పిలిచి చెప్పుతో కొట్టమన్నాను. ఆమె కాళ్లపై పడి క్షమాపణలు వేడుకోమని చెప్పడంతో రేణుకా స్వామి పవిత్ర కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. ఆ తర్వాత పవిత్రను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని వినోద్ కి చెప్పాను. నా డ్రైవర్ లక్ష్మణ్ రేణుకా స్వామి మెడ మీద బలంగా కొట్టాడు. ఆ తర్వాత రేణుకా స్వామి ఫోన్ తీసుకుని అతను పంపిన మెసేజ్ లు, ఫొటోలు చూశాం. అవి చూసి నేను మళ్లీ రేణుకా స్వామిని కొట్టాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాను" అని దర్శన్ చెప్పారు.
ఇంటికి వెళ్లాకే తెలిసింది...
"ఇంటికి వెళ్లే ముందు షెడ్ ఓనర్ ని కలిసి మాట్లాడాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. కొద్దిసేపటి తర్వాత ప్రదోశ్ ఇంటికి వచ్చి రేణుకా స్వామి మరణించాడని చెప్పాడు. ఆ మ్యాటర్ తనకు వదిలేయాలని, తాను అంతా చూసుకుంటానని భరోసా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత నాగరాజ్, లక్ష్మణ్ ఇద్దరూ కూడా ఫోన్ చేసి రేణుకా స్వామి మరణించినట్లు చెప్పారు. ఈ మ్యాటర్ ని డీల్ చేసేందుకు తనకు రూ. 30లక్షలు ఇవ్వాలని ప్రదోశ్ కోరితే ఇచ్చాను. ఆ తర్వాత వినయ్ కూడా రూ. 10లక్షలు అడిగితే అతనికి కూడా ఇచ్చాను" అని వివరించాడు దర్శన్.
చాలామందికి మెసేజ్ లు పంపాడు
దర్శన్ చేతిలో హత్యకు గురైన రేణుకా స్వామి పవిత్ర గౌడకి మాత్రమే కాకుండా చాలామందికి అసభ్యకర్ మెసేజ్ లు పంపినట్లు దర్శన్ చెప్పారు. అంతే కాకుండా గౌతమ్ అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన రేణుకా స్వామి తన ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు పవిత్రకి పంపి టార్చర్ చేసేవాడని కూడా తన స్టేట్ మెంట్ లో చెప్పారు దర్శన్. ఇక ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్, మరో 15 మంది నిందితులకు సెప్టెంబర్ 12 వరకు రిమాండ్ పొడిగిచింది కోర్టు.
Also Read: డైరెక్టుగా ఓటీటీలోకి శోభితా ధూళిపాళ సినిమా 'లవ్ సితార'... స్ట్రీమింగ్ ఎప్పుడు? రిలీజ్ ఎక్కడంటే?