అన్వేషించండి

Daksha Nagarkar: ఎవరూ బాధపడొద్దు - ఆసుప్రతిలో చేరిన దక్ష నాగర్కర్, ఏమైంది?

Daksha Nagarkar: టాలీవుడ్ యంగ్ బ్యూటీ దక్ష నాగర్కర్ కూడా ఒకరు. తన గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకున్న దక్ష ఆరోగ్య సమస్యతో ఆసుప్రతిలో చేరింది. అంతే కాకుండా తనకు సర్జరీ జరిగిన విషయాన్ని కూడా బయటపెట్టింది.

Daksha Nagarkar: కొందరు హీరోయిన్లు ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా వారికి తగినంత గుర్తింపు రాదు. టాలీవుడ్‌లో కూడా అలాంటి హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో దక్ష నాగర్కర్ కూడా ఒకరు. అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో, చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్న దక్ష.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫోటోషూట్స్‌తో ఫాలోవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. అలాంటి దక్ష.. తాజాగా చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. తన ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి, దానికోసం జరిగిన సర్జరీ గురించి ఈ పోస్ట్ ద్వారా బయటపెట్టింది దక్ష.

కష్టంగా గడుస్తోంది..

‘‘గత కొన్నిరోజుల నుంచి చాలా కష్టంగా గడుస్తోంది. ఒక సర్జరీ రూమ్ నిండా మనుషుల మధ్యలో స్ట్రెచ్చర్‌పై పడుకొని ఉండడం దగ్గర నుంచి.. నా వెన్నుముకను రెండుసార్లు సూది గుచ్చి అనెస్థిషీయా ఇవ్వడం వరకు.. అన్నీ కష్టంగా అనిపించాయి. వాటి నుంచి కోలుకోవడం మరింత కష్టంగా అనిపించింది. నా ఎమోషన్స్ అన్నింటిని హ్యాండిల్ చేయడానికి నేను విశ్వప్రయత్నాలు చేశాను. నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ పనిని నాకు సులువు చేశారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎలా ఉంటుంది అనేది వారు నాకు చూపించారు. కనిపించని గాయాలను నయం చేసే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుంది’ అంటూ తన సర్జరీ గురించి చెప్పుకొచ్చింది దక్ష నగార్కర్.

బాధపడొద్దు..

‘ఇలాంటిది ఎవరికీ జరగకూడదని కోరుకుంటున్నాను. మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ చుట్టూ మిమ్మల్ని అమితంగా ప్రేమించే మనుషులు ఉండేలా చూసుకోండి. సంతోషరకమైన విషయాలను మాత్రమే ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరూ దీని గురించి బాధపడడం నాకు ఇష్టం లేదు’ అంటూ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దక్ష నగార్కర్. అందులో తన చేతికి సెలైన్ ఎక్కుతున్న ఫోటో కూడా ఉంది. అయితే ఇంతకీ తనకు ఏ సమస్య వచ్చింది, సర్జరీ ఎందుకు జరిగింది లాంటి విషయాలను దక్ష బయటపెట్టలేదు. కానీ ఏదో ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతున్నట్టు మాత్రం ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది ఈ భామ.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

పదేళ్లు అయిపోయింది..

2014లో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దక్ష నగార్కర్. ఈ పదేళ్లలో తను కేవలం అరడజను సినిమాల్లో మాత్రమే నటించింది. యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు’తో ప్రేక్షకుల్లో కాస్త గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘జాంబీ రెడ్డి’ ద్వారా దక్షకు మరింత రీచ్ లభించింది. ఇందులో తను హీరోగా నటించకపోయినా.. హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత నాగచైతన్య, నాగార్జున మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘బంగార్రాజు’లో ఒక చిన్న పాత్రలో కనిపించింది మరోసారి యూత్‌ను ఫిదా చేసింది. ప్రస్తుతం దక్ష నాగర్కర్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

Also Read: వేశ్యలను అలా చూపించడం బాలీవుడ్‌కు అలవాటే - ‘హీరమండి’పై వివేక్ అగ్నిహోత్రి విమర్శలు

టాప్ హెడ్ లైన్స్

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
Maa Inti Bangaram: వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత
Gautam Ghattamaneni: ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget