అన్వేషించండి

దిల్ రాజు చేతికి 'యానిమల్' రైట్స్ - ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'యానిమల్' మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

టాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో 'యానిమల్'(Animal) అనే మోస్ట్ వైలెంట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో షాహిద్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇప్పుడు రణబీర్ కపూర్‌ను ఊర మాస్ రేంజ్ లో చూపించడానికి సిద్ధమయ్యాడు సందీప్ వంగ. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి అంతా కాదు.

అప్పటిదాకా బోర్డర్లు పెట్టుకున్న టాలీవుడ్‌కు ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో కల్ట్ ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు ఎటువంటి బార్డర్స్ లేని బాలీవుడ్ లో 'యానిమల్'తో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ప్రీ టీజర్ లో మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్‌ను గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు బాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రీటీజరే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని రణబీర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం 'యానిమల్' టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయినట్లు సమాచారం వినిపిస్తోంది. 'యానిమల్' మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.15 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ ని దిల్ రాజు కొనుగోలు చేశారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. సినిమాపై ఇప్పుడున్న హైప్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ నెంబర్ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పైగా 'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ 'యానిమల్'పై భారీ అంచనాలు ఉన్నాయి.

దానికి తోడు ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. వీటన్నింటిని బట్టి చూస్తే 'యానిమల్'తో దిల్ రాజుకి మంచి లాభాలు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. రివెంజ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ రణబీర్ కి తండ్రిగా కనిపించనున్నారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేసినా విఎఫ్ఎక్స్ కారణంగా డిసెంబర్ కు వాయిదా వేశారు. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : ఆ వెబ్ సీరిస్ కోసం సీరియల్ తల్లి జ్యోతి రాయ్ గ్లామర్ షో - ఇక ఫ్యాన్స్‌కు పండగే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
Jana Nayagan : జన నాయగన్‌కు విజయ్ రెమ్యునరేషన్ - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
జన నాయగన్‌కు విజయ్ రెమ్యునరేషన్ - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget