అన్వేషించండి
Advertisement
Adipurush Controversy: ప్రభాస్ కు షాక్.. మరో కొత్త వివాదంలో 'ఆదిపురుష్'..!
ఇటీవల విడుదలైన 'ఆదిపురుష్' ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో ఒక్కసారిగా సినిమా చుట్టూ పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంపై మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. జూన్ లో భారీ ఎత్తున థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇటీవలే రిలీజైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన తర్వాత, ట్రైలర్ రాకతో ఇన్నాళ్లకు ఈ మూవీపై ఓ పాజిటివ్ బజ్ వచ్చింది. అయినా సరే ఈ చిత్రాన్ని వివాదాలు మాత్రం వదిలేలా కనిపించడం లేదు.
'ఆదిపురుష్' సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) బోర్డులో తాజాగా ఓ ఫిర్యాదు దాఖలైంది. సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్ తివారీ బాంబే హైకోర్టు న్యాయవాది ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా ద్వారా కంప్లెయింట్ చేశారు. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి ముందే స్పెషల్ స్క్రీన్ టెస్ట్ నిర్వహించాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ లెటర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
దీని ప్రకారం బాలీవుడ్ ఫిలిం 'ఆదిపురుష్' మేకర్స్, అర్టిసులు సినిమా పోస్టర్ల విషయంలో గతంలో చాలాసార్లు తప్పులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్ లో మేకర్స్ చేసిన పొరపాట్లు సినిమాలో కూడా ఉంటే, సనాతన ధర్మానికి చెందిన వ్యక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. అదే జరిగితే దేశంలో శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయాలని, సెన్సార్ షిప్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
నిజానికి 'ఆది పురుష్' సినిమాకి వివాదాలు కొత్తేం కాదు. ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి ఏదొక కాంట్రవర్సీ అవుతూనే వుంది. టీజర్ వచ్చిన తర్వాత శ్రీరాముడు, సీత, రావణుడు, హనుమాన్ పాత్రలను చిత్రీకరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో పాత్రల వర్ణన మన ఇతిహాసానికి ఏమాత్రం పొంతన లేదని.. ఇది వారి గౌరవానికి విరుద్ధంగా ఉందని ఆరోపించారు.
'ఆదిపురుష్' టీజర్ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య & బ్రజేష్ పాఠక్ వ్యాఖ్యానించారు. అలానే హనుమంతుడికి లెదర్ జాకెట్ వేశారని, అభ్యంతరకర సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు. ఈ నేపధ్యంలో సినిమాని సంక్రాంతి నుంచి వాయిదా వేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ మీద వర్క్ చేసి మెరుగైన అవుట్ పుట్ తో వచ్చారు. అప్పుడు విమర్శలు చేసిన మధ్యప్రదేశ్ హోంమంత్రి సైతం ట్రెయిలర్ చూసి ఈసారి ప్రశంసించారు.
అయినప్పటికీ 'ఆదిపురుష్' ట్రయిలర్ వస్తుందనగానే ఫ్యాన్స్ ఎంత సంబరపడ్డారో, అంతే భయపడ్డారు కూడా. ఈసారి ఇంకెన్ని విమర్శలు ఎదుర్కోవాలో, ఇంకెన్ని వివాదాలు తలెత్తుతాయో అని అందరూ భయపడ్డారు. అయితే ఆడియన్స్ నుంచి ఈ వీడియోకి అనూహ్య స్పందన లభించింది. కాకపొతే టీజర్ టైమ్ లో అత్యంత వివాదాస్పదమైన రావణాసురుడి లుక్ ను ట్రైలర్ లో చూపించలేదు. కేవలం ఓ బిక్షువుగా మాత్రమే చూపించారు. ఈ క్రమంలో ఇప్పుడు సంజయ్ దీనానాథ్ ఫిర్యాదుతో సినిమా చుట్టూ కొత్త వివాదం నెలకొంది.
వాస్తవానికి ఏ సినిమా అయినా సెన్సార్ పూర్తయిన తర్వాతే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. CBFC బోర్డు సభ్యులు సినిమా చూసి తర్వాతే సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఏమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్స్ ఉంటే కటింగ్స్ సూచిస్తారు. ఈ ప్రాసస్ అంతా జరిగిన తరువాతే సినిమా బయటకి వస్తుంది. 'ఆది పురుష్' సినిమా అయినా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే రిలీజ్ కు రెడీ అవుతుంది. అలాంటప్పుడు దేనిపై ప్రత్యేకంగా సీబీఎఫ్సీకి ఫిర్యాదు చేయడం ఎందుకో అర్థం కావడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.
కాగా, ఆదిపురుష్ లో రాఘవగా ప్రభాస్, లంకేష్ గా సైఫ్ అలీఖాన్, జానకిగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, దేవదత్ నాగే హనుమంతుడిగా నటించారు. అజయ్-అతుల్ సంగీతం సమకూర్చారు. టీ-సిరీస్ వారు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా 3డీ, ఐమాక్స్ ఫార్మాట్స్ లో విడుదల కానుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆట
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion