అన్వేషించండి

‘కేరళ స్టోరీ’ వివాదం - పశ్చిమ బెంగాల్ సైతం అదే నిర్ణయం

‘కేరళ స్టోరీ’ సెగ ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఈ మూవీ ప్రదర్శన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు వెనకడుగు వేస్తున్నాయి. షోను రద్దు చేస్తున్నాయి. అల్లరు జరిగితే థియేటర్లు ధ్వంసం చేస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది.  

ANI వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. రాష్టంలో ద్వేషం, హింసాత్మక సంఘటనలు నివారించడానికి, శాంతిని కొనసాగించడానికి ‘ది కేరళ స్టోరీ’ మూవీని నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ కూడా ఒక వర్గాన్ని కించపరిచే చిత్రమేనని, ఇది విక్రీకరించిన కథ అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ.. ‘‘మమతా మా మూవీపై నిషేదం విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అది చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడుతాం’’ అని వెల్లడించారు. 

‘ది కేరళ స్టోరీ’లో సున్నితమైన అంశాలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో తమిళనాడులో కూడా ఈ మూవీపై నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేరుగా థియేటర్ అసోషియేషన్లే తీసుకోవడం గమనార్హం. తొలుత ఈ మూవీని పలు మల్టిప్లెక్స్‌ థియేటర్లలో ప్రదర్శించారని, అయితే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, వివిధ వర్గాల నుంచి బెదిరింపులు రావడం తదితర కారణాలతో మూవీ ప్రదర్శన నిలిపేయాలని నిర్ణయించుకున్నారు.  

‘ది కేరళ స్టోరీ’కథ ఏంటంటే?

‘ది కేరళ స్టోరీ’ సినిమాను డైరెక్టర్ సుదీప్తోసేన్‌ రూపొందించారు. కేరళలో గత కొద్ది సంవత్సరాలుగా 32 వేల మంది యువతులు, మహిళలు అదృశ్యమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకీ వారు ఏమయ్యారు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. కేరళకు చెందిన నలుగురు యువతులు బలవంతంగా మతం మారి, ఆ తర్వాత వాళ్లు ఐసిస్ లో చేరడం ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ మూవీని ప్రదర్శిస్తున్నారు. 

3 రోజుల్లో రూ.35 కోట్లు వసూళ్లు - త్వరలో ఓటీటీలోకి... 

మే 5, 2023న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అఖండమైన స్పందన వస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు రూ. 35 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ, కొన్ని థియేటర్లు షోస్ నిలిపేస్తుండటంతో నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. దీంతో ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా OTT హక్కులు ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Zee5 చేతికి ఓటీటీ రైట్స్?

'ది కేరళ స్టోరీ' మూవీ ఓటీటీ OTT హక్కులను డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం జీ 5(Zee5)కొనుగోలు చేసింది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ థియేట్రికల్ విడుదలైన 4-6 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్టు తెలుస్తోంది. అంటే జూన్ మూడవ వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి అరంగేట్రం చేయించాలని మేకర్స్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget