Chiranjeevi : 'మన శంకరవరప్రసాద్ గారు' ఆల్రెడీ సూపర్ హిట్... మెగా ఫ్యాన్స్‌కు మెగాస్టార్ రిక్వెస్ట్
Chiranjeevi Reaction : 'మన శంకరవరప్రసాద్ గారు' ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ పండుగకు అన్నీ సినిమాలు హిట్ కావాలని ఆకాంక్షించారు.

Chiranjeevi About Mana Shankara Varaprasad Garu : 'మన శంకరవరప్రసాద్ గారు' పండుగ లాంటి సినిమా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సంక్రాంతికి అన్నీ సినిమాలు మంచి హిట్ కావాలని ఆకాంక్షించారు. 'ఈ సంక్రాంతి మొత్తం తెలుగు సినిమా పరిశ్రమది అవ్వాలని కోరుకుంటున్నా. ప్రభాస్ రాజాసాబ్, నా తమ్ముడు రవితేజ సినిమా, మా ఇంట్లో చిన్నప్పుడు నుంచి సరదాగా తిరుగుతూ పెరిగిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నన్ను గురువుగా భావిస్తూ నా శిష్యుడుగా ఉన్న నవీన్ సినిమా.. అన్ని సినిమాలు ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలి.
తెలుగు చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నా. ఈ సంక్రాంతి తెలుగు సినిమా పరిశ్రమ మర్చిపోకూడదు. ప్రతి సినిమా పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమా, నచ్చే సినిమా. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడేలా చేసే బాధ్యత మీది, అన్ని సినిమాల్ని థియేటర్స్‌కి వెళ్లి చూడండి. థియేటర్స్‌లోనే ఆస్వాదించండి.' అని తెలిపారు.
అప్పటి బ్లాక్ బస్టర్స్‌లానే...
ఈ మూవీ అప్పటి ఘరానా మొగుడు, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, చంటబ్బాయి సినిమాల్లానే ఉంటుందని చిరంజీవి అన్నారు. 'సినిమాలో ఫ్యామిలీ టచ్, సెంటిమెంట్, హార్ట్ టచ్చింగ్ సీన్స్ ఉన్నాయి. అప్పటి నా సినిమాలు ఎలా ఉండేవో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. అప్పట్లో ఆ సినిమాలన్నీ జనం చూశారు. వాళ్లంతా పెద్ద వాళ్లయిపోయారు. ఇప్పుడున్న జనరేషన్‌కి అవి చూపించబోతున్నాం. అలా చేయడం నాకు కేక్ వాక్.
నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా డైరెక్టర్ అనిల్ అద్భుతంగా సీన్స్ డిజైన్ చేస్తూ వచ్చారు. తనతో ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున నేను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాను. ప్రతి రోజు ఒక పిక్నిక్ వెళ్లినట్టుగా సరదా సరదాగా జరిగింది. అనిల్ రావిపూడి అంత మంచి పాజిటివ్ అట్మాస్పియర్ క్రియేట్ చేశారు. సినిమా తీయడమే కాదు, దాన్ని ఎడిటింగ్ విషయంలోనూ అనిల్ ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. సినిమాను ఎంతగా ప్రేమిస్తాడో, అనవసర సన్నివేశం వస్తే, నిర్దాక్షణ్యంగా తీసేస్తాడు.' అని అన్నారు.
Also Read : కత్రినా కైఫ్ కొడుకు పేరు అర్థం ఇదే.. విహాన్ పేరుతో విక్కీ కౌశల్‌కు ప్రత్యేక అనుబంధం!?
ఆల్రెడీ సూపర్ హిట్
ఈ మూవీలో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యిందని చిరంజీవి అన్నారు. 'లిమిటెడ్ బడ్జెట్‌లో అనుకున్న దాని కంటే తక్కువ రోజుల్లో అత్యద్భుతంగా తీయగలిగాం. నా తమ్ముడు వెంకీతో మూవీ చేయడం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. 'వెంకీ మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. నయనతార ఈ సినిమా కోసం తను కూడా మాకు కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయింది. నటీనటులు అందరూ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
భీమ్స్ అద్భుత మ్యూజిక్ అందించారు. నా బిడ్డ సుస్మిత నిరంతరం కష్టపడుతూ పనిచేసింది. ఈ సినిమా కూడా సాహూ గారితో కలిసి తను నిర్మాణం చేసింది. రామ్ చరణ్‌తో పాటు తను నాకు మరో బిడ్డ. ఇదే కష్టాన్ని నమ్ముకోండి. కచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేస్తాడు. ప్రతి ఒక్కరు ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధిలోకి వస్తారని నాకు తెలుసు. ఇదే అభిమానం ప్రేమ మీరు ఎప్పుడూ నా మీద చూపించాలి.' అని అన్నారు.






















