అన్వేషించండి

Chhota Bheem Trailer: ‘ఛోటా భీమ్’ ట్రైలర్ - రాక్షస సర్పాన్ని ఎదిరించడానికి వచ్చేస్తున్న బుల్లి సూపర్ హీరో

Chhota Bheem And The Curse of Damyaan: ఛోటా భీమ్ లాంటి ఒక సూపర్ హీరో కథను.. ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కించడానికి బాలీవుడ్ ముందుకొచ్చింది. ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది.

Chhota Bheem Trailer Is Out Now: యానిమేషన్ మేకర్స్ క్రియేట్ చేసిన అందరు సూపర్ హీరోల్లో చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన సూపర్ హీరో ‘ఛోటా భీమ్’. ఇప్పటికే ఈ క్యారెక్టర్‌పై పలు యానిమేషన్ సిరీస్‌లు, సినిమాలు వచ్చాయి. కానీ మొదటిసారి ఈ క్యారెక్టర్ ఆధారంగా బాలీవుడ్‌లో ఒక హై బడ్జెట్ ఫీచర్ ఫిల్మ్ రానుంది. అదే ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్’. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఛోటా భీమ్.. దమ్యాన్ అనే విలన్‌తో పోటీపడనున్నాడు. కానీ దమ్యాన్ మనిషి కాదు.. ఒక పాము. ఇది ఫీచర్ ఫిల్మ్ అయినా కూడా ఇందులో పిల్లలకు నచ్చే చాలా ఎలిమెంట్స్‌ను యాడ్ చేశారు మేకర్స్.

1000 ఏళ్ల తర్వాత..

సోనాపూర్ అనే గ్రామంలో ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యాన్’ కథ మొదలవుతున్నట్టుగా ట్రైలర్‌లో చూపించారు. సోనాపూర్‌లోని ప్రజలను దమ్యాన్ అనే రాక్షస పాము తన స్వాధీనం చేసుకుంటుంది. దీంతో సోనాపూర్‌ను కాపాడడం కోసం ఆ పామును శాశ్వతంగా భూమిలోకి వెళ్లిపోవాలని శాపం పెడతారు అక్కడి ప్రజలు. అలా ఆ పాముతో పాటు సోనాపూర్ మొత్తం భూమి లోపలికి వెళ్లిపోతుంది.

1000 ఏళ్ల తర్వాత ఢోలక్‌పూర్ అనే గ్రామంలో మన సూపర్ హీరో ఛోటా భీమ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఊరి ప్రజలతో సాన్నిహిత్యంగా ఉంటూ, తన స్నేహితులతో కలిసి ఎప్పుడూ అల్లరి చేస్తుంటాడు భీమ్. ‘ఢోలక్‌పూర్‌కు వచ్చే ప్రతీ సమస్యకు నేను అడ్డుగోడగా మారుతాను’ అంటూ ఛోటా భీమ్.. తన ఊరిని, అక్కడి ప్రజలను కాపాడుతూ ఉంటాడు.

శతాబ్దంలో ఒక్కడు..

ఇంతలోనే శాపం నుంచి విముక్తి పొందిన దమ్యాన్.. మళ్లీ భూమిపైకి వస్తాడు. తన చుట్టూ ఉండే అనుచరుల సాయంతో రాజు కావాలని అనుకుంటారు దమ్యాన్. అప్పట్లో సోనాపూర్‌గా ఉన్న గ్రామం.. ఇప్పుడు ఢోలక్‌పూర్‌గా మారుతుంది. ఢోలక్‌పూర్‌ను స్వాధీనం చేసుకొని, దానికి రాజుగా మారాలనుకున్న దమ్యాన్‌కు ఛోటా భీమ్ అడ్డుపడతాడు. అప్పుడే తనకు సూపర్ పవర్ వచ్చి సూపర్ హీరోగా మారుతాడు. ‘‘వేరేవాళ్ల ప్రాణాలను కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని మనిషి ఒకడు ఉంటాడు. అలాంటి పిల్లవాడు శతాబ్దంలో ఒక్కడే పుడతాడు’’ అంటూ ఛోటా భీమ్ క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తారు అనుపమ్ ఖేర్.

పాత్రకు న్యాయం..

అలా ఛోటా భీమ్.. దమ్యాన్ లాంటి రాక్షసుడితో పోరాడి తన ఊరిని, ప్రజలను ఎలా కాపాడుకుంటాడు అన్నదే సినిమా కథ అని ‘ఛోటా భీమ్’ ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు. ఇక ఈ ఫీచర్ ఫిల్మ్‌లో పిల్లలకు నచ్చే విధంగా గ్రాఫిక్స్‌ను కూడా డిజైన్ చేశారు మేకర్స్. ఛోటా భీమ్ అంటే ఎప్పుడూ సరదాగా ఉండాలి, తను నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండాలి. అలాంటి క్యారెక్టర్‌కు యగ్యా భాసిన్ పూర్తిగా న్యాయం చేసినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. తనతో పాటు అనుపమ్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే, కభీర్ షేక్, అద్విక్ జైస్వాల్, దైవిక్ దవార్, ఆష్రియా మిష్రా వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘ఛోటా భీమ్’ను రాజీవ్ చిలక డైరెక్ట్ చేశారు. మే 24న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.

Also Read: బిజీ బిజీగా రణ్‌బీర్.. ఇటు 'రామాయ‌ణ', త్వ‌ర‌లోనే 'ల‌వ్ అండ్ వార్'

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget