Bramayugam: మమ్ముట్టి ‘భ్రమయుగం’ సినిమాపై కేసు - చివరి నిమిషంలో అలాంటి మార్పులు
Bramayugam Controversy: మమ్ముట్టి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న ‘భ్రమయుగం’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇంతలో ఈ సినిమాపై కేసు నమోదలయినట్టు మాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
Case Filed on Mammootty Bramayugam: మాలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇప్పటికీ కూడా వైవిధ్యభరిమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. అదే తరహాలో త్వరలో ‘భ్రమయుగం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫిబ్రవరీ 15న ఈ మూవీ విడుదలకు సిద్ధమవ్వగా తాజాగా ఈ సినిమాపై కేసు ఫైల్ అయ్యిందని, దాని వల్ల చివరి నిమిషంలో పలు మార్పులు చేయవలసి వచ్చిందని మాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ‘భ్రమయుగం’ ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే సమయంలో సినిమాపై కేసు అనడంతో మమ్ముట్టి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
కోర్టుకెక్కిన ఫ్యామిలీ..
‘భ్రమయుగం’లో మమ్ముట్టి కుంజమోన్ పొట్టి అనే పాత్రను పోషిస్తున్నారు. ఇది కేరళలోని ఒక బ్రాహ్మణ కమ్యూనిటికీ నచ్చలేదు. అందుకే పుంజమోన్ ఇల్లమ్ అనే కమ్యూనిటీ.. ‘భ్రమయుగం’పై కేసు పెట్టినట్టు సమాచారం. 1952 సినిమాటోగ్రాఫీ యాక్ట్‌లోని సెక్షన్ 5బీ ప్రకారం ఈ కేసు ఫైల్ అయ్యింది. తాజాగా కేరళ హైకోర్టులో ఈ కేసును సంబంధించిన హియరింగ్ కూడా జరిగింది. ఇప్పటికే విడుదలయిన సినిమా ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ఇందులో మమ్ముట్టి క్యారెక్టర్‌కు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని, దాని వల్ల తమ కుటుంబ గౌరవానికి, గుర్తింపుకు భంగం కలుగుతుందని పుంజమోన్ ఇల్లమ్ ఫ్యామిలీ కోర్టుకెక్కింది.
టీమ్ నుండి స్పందన లేదు..
‘భ్రమయుగం’లో మమ్ముట్టి పేరు మార్చాలని కేసు ఫైల్ చేసినవారు డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ సెర్టిఫికేషన్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం ఉంది. అయినా కూడా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఇందులో మమ్ముట్టి పాత్ర చేతబడి చేయడమే దీనికి కారణమని వారు తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా ‘భ్రమయుగం’ టీమ్ మాత్రం ఈ విషయంపై స్పందించడానికి ముందుకు రాలేదు. కానీ పుంజమోన్ ఇల్లమ్ కమ్యూనిటీ డిమాండ్ చేసినట్టుగా చివరి నిమిషంలో సినిమాలోని మమ్ముట్టి క్యారెక్టర్ పేరును మార్చడానికి వారు సిద్ధమయినట్టు తెలుస్తోంది. విడుదలకు ఒకరోజు ముందు మార్పులు చేర్పులు చేయడం కష్టమే అయినా ప్రస్తుతం సినిమాకు వచ్చిన ఇబ్బందులను తప్పించాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అంచనాలకు రావద్దు..
‘భ్రమయుగం’లో మమ్ముట్టి పాత్ర పేరు కుంజమోన్ పొట్టి కాగా.. దానిని కోడుమోన్ పొట్టిగా మారుస్తున్నట్టు సమాచారం. సినిమాలో ఆయన పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ట్రైలర్ చూస్తే ప్రేక్షకులకు అర్థమయిపోతుంది. కానీ మూవీ టీమ్ మాత్రం మమ్ముట్టి పాత్ర గురించి పెద్దగా రివీల్ చేయడానికి ఇష్టపడడం లేదు. తాజాగా అబూ ధాబీలో ‘భ్రమయుగం’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూసి అంచనాలకు రావద్దని, మైండ్‌లో ఏం ఆలోచనలు పెట్టుకోకుండా సినిమాను చూడమని ప్రేక్షకులను కోరారు మమ్ముట్టి. ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భారతన్, అమాల్డా లిజ్, మణికందన్ ఆర్ ఆచారీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
Also Read: ఏంటీ, ఆ ముద్దుగుమ్మల మధ్య ఉన్న వ్యక్తి ఆయనా? మీరు గుర్తుపట్టారా?