(Source: ECI/ABP News/ABP Majha)
Bipasha Basu : హార్ట్‌లో రెండు హోల్స్‌తో పుట్టింది, కూతురి గురించి చెప్తూ ఎమోషనల్ అయిన బిపాసా బసు
తన పాప దేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది బిపాసా. దేవి పుట్టినప్పుడు తన హార్ట్‌కు రెండు హోల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎన్నో బాలీవుడ్ జంటలు ఇప్పుడు తల్లిదండ్రులుగా మారాయి. అందులో బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ జంట కూడా ఒకటి. గత ఏడాది నవంబర్‌లో ఈ జంటకు దేవి బసు సింగ్ గ్రోవర్ అనే బేబి గర్ల్ పుట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకొని పాపకు జన్మనిచ్చిన ఈ జంట... ఆ తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్‌లోనే బిజీ అయిపోయింది. బిపాసా అయితే కొన్నాళ్ల వరకు తన కమిట్‌మెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి పాపను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకుంది. చాలా రోజుల తర్వాత తెర ముందుకు వచ్చిన బిపాసా... నేహా దూపియాతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన పాప దేవి గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. దేవి పుట్టినప్పుడు హార్ట్‌కు రెండు హోల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.
దేవి పుట్టినప్పుడే తన హార్ట్‌లో రెండు హోల్స్ ఉన్నట్టు డాక్టర్లు గమనించారని నేహా దూపియాతో పాల్గొన్న ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో తెలిపింది బిపాసా బసు. అందుకని, చిన్నారికి మూడు నెలల వయసు ఉన్నప్పుడే సర్జరీ చేయించాల్సి వచ్చిందని చెప్పింది. ''మా ప్రయాణం సాధారణ అమ్మ, నాన్న కంటే చాలా కష్టంగా మొదలయ్యింది. ప్రస్తుతం నా మొహంలో కనిపిస్తున్న చిరునవ్వు కోసం చాలా కాలం ఎదురు చూశా. ఇలా ఏ తల్లికి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పాప పుట్టిన మూడు రోజుల తర్వాత తన హార్ట్‌లో హోల్స్‌తో పుట్టిందని మాకు తెలిసింది. అప్పుడే తల్లిగా మారిన ఒక మహిళకు ఆ వార్త ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను'' అని తన బాధను బయటపెట్టింది బిపాసా బసు.
వీఎస్‌డీ అనే వ్యాధే కారణం..
‘‘నా పాప గురించి ఈ విషయాన్ని షేర్ చేసుకోకూడదు అనుకున్నాను. కానీ, నాకు ఈ జర్నీలో చాలా మంది తల్లులు తోడుగా ఉన్నారు. అలాంటి తల్లులు దొరకడం చాలా అదృష్టం’’ అని తనకు కష్టాల్లో తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది బిపాసా. అంతే కాకుండా తన కూతురు దేవికి వీఎస్‌డీ ( వెంట్రిక్యూలర్ సెప్టల్ డిఫెక్ట్) అనే వ్యాధి ఉందని కూడా బయటపెట్టింది. ’’నాకు, కరణ్‌కు అసలు వీఎస్‌డీ అంటే ఏంటో కూడా అర్థం కాలేదు. మేము చాలా కష్ట కాలాన్ని గడిపాము. అసలు ఈ విషయాన్ని మా కుటుంబాలతో కూడా పంచుకోలేదు. ఏమీ అర్థం కాని అయోమయ స్థితిలో ఉండిపోయాం. మాకు పాప పుట్టిందని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. కానీ, మాకు అసలు చలనమే లేదు. పాప పుట్టిన తర్వాత మొదటి అయిదు నెలలు చాలా కష్టంగా గడిచాయి. కానీ, దేవి మాత్రం మొదటి రోజు నుండే చాలా యాక్టివ్‌గా ఉండేది’’ అంటూ తన కూతురు పడ్డ కష్టం గురించి గుర్తుచేసుకుంది బిపాసా బసు.
40 రోజులు పూర్తిగా నిద్ర లేదు..
‘‘ప్రతీ నెలా దేవికి స్కానింగ్ చేయించాలని చెప్పారు. దాని వల్ల హార్ట్‌లో హోల్ దానంతట దానిగా తగ్గిపోతుందేమో తెలుస్తుందన్నారు. కానీ తన హార్ట్‌కు హోల్ చాలా పెద్దగా ఉండడంతో సర్జరీ తప్పదని చెప్పేశారు. దేవి మూడు నెలలు ఉన్నప్పుడే సర్జరీ జరిగింది. కరణ్ మాత్రం దేవి సర్జరీకి అసలు రెడీగా లేడు. నాకు ఇంకా గుర్తుంది... దేవి సర్జరీ కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను చాలా రీసెర్చ్ చేశాను, సర్జన్స్‌ను కలిశాను, ఎన్నో ఆసుపత్రులకు తిరిగాను, డాక్టర్లతో మాట్లాడాను. అవన్ని చేయడం వల్ల నేను రెడీగా ఉన్నాను. కానీ, కరణ్ మాత్రం రెడీగా లేడు. నాకు తెలుసు... అమ్మాయికి కచ్చితంగా నయం అయిపోతుందని, ఇప్పుడు తను ఓకే. కానీ మన పిల్లలకు సరైన ప్లేస్‌లో, సరైన సమయానికి సర్జరీ జరగాలి. అదే ముఖ్యం. దేవికి ఆరు గంటల పాటు సర్జరీ జరిగింది. ఆ తర్వాత దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా... నేను అసలు 40 రోజులు పూర్తిగా పడుకోలేదు.’ అని తల్లిగా మారిన తొలిరోజుల్లోనే తన కష్టాల గురించి వివరంగా తెలిపింది బిపాసా బసు.
Also Read: మళ్లీ ఆ తప్పు చేయను, ‘అలా వైకుంఠపురంలో’ రీమేక్‌పై హీరో కార్తీక్ ఆర్యన్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial