Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కొత్త మూవీ - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.. హిస్టారికల్ హిస్టరీ రిపీట్!
NBK 111 Movie: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కొత్త మూవీ అప్‌డేట్ వచ్చేసింది. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK 111' కొత్త మూవీ హిస్టారికల్ ఎపిక్‌గా రానుంది.

Balakrishna's New Movie Announced: గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే న్యూస్. ఆయన కొత్త మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ తర్వాత మూవీ చేయబోతున్నారు.
ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా కొత్త మూవీ 'NBK 111' ప్రకటన చేశారు మేకర్స్. ఇప్పటివరకూ మాస్ ఎంటర్‌టైనర్ జానర్‌లో మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మరోసారి బాలయ్యతో జత కట్టబోతున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'వీరసింహారెడ్డి' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది.
ఫస్ట్ పోస్టర్ వేరే లెవల్..
ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. 'రోరింగ్ బ్లాక్ బస్టర్ కాంబో తిరిగివస్తుంది. చారిత్రక గర్జన ప్రారంభమవుతుంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్.
హిస్టారికల్ ఎపిక్
ఉగ్రరూపంలో ఉన్న సింహం ఓ వైపు.. లోహంతో ఉండే కవచం మరోవైపు ఉన్న పోస్టర్ చూస్తుంటే బాలకృష్ణ రోల్ వేరే లెవల్ అని అర్థమవుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరొందిన బాలయ్య మరో హిస్టారికల్ ఎపిక్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో ఆరితేరిన గోపీచంద్ మలినేని ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జానర్‌లో మూవీ తీయబోతున్నారు. వీరిద్దరి హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందని.. మరోసారి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
The ROARING BLOCKBUSTER combo reunites ❤️🔥
— Vriddhi Cinemas (@vriddhicinemas) June 8, 2025
HISTORICAL ROAR BEGINS 🦁💪🏽🔥#NBK111 will be a celebration of the 'GOD OF MASSES' #NandamuriBalakrishna on the big screens 👑
Directed by the Blockbuster Mass Director @megopichand ⚡
Produced by the passionate #VenkataSatishKilaru… pic.twitter.com/uQv9NmYb98
ఇంతకు ముందెన్నడూ చూడని రీతిలో బాలయ్య కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. హిస్టరీ హై ఆక్టేన్ యాక్షన్ కలిపి ఓ హిస్టారికల్ ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నట్లు మూవీ టీం తెలిపింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి నటీనటులు, ఇతర అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.
'అఖండ 2' పూర్తైన వెంటనే..
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ హిట్ ఖాయమంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక 'అఖండ 2' టీజర్ సోమవారం సాయంత్రం రిలీజ్ కానుంది.






















