Akhanda 2 Collections : బాలయ్య 'అఖండ 2' ర్యాంపేజ్ - ప్లేస్ ఏదైనా రికార్డ్ బుకింగ్స్ పక్కా... ఫస్ట్ డే కలెక్షన్స్ కలెక్షన్స్ ఎంత రావొచ్చంటే?
Akhanda 2 Day 1 Collection : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య 'అఖండ 2'కు రికార్డ్ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మేజర్ ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్ సేల్స్ ఊపందుకున్నాయి.

Balakrishna's Akhanda 2 Premiere Bookings First Day Collections : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో 'అఖండ 2' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలు కాగా రికార్డు సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా లక్షల్లో టికెట్స్ అమ్ముడుపోతుండగా... మొదటి రోజే సంచలన కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రీమియర్ బుకింగ్స్... కలెక్షన్స్ ఎంతంటే?
గురువారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోస్‍తో వరల్డ్ వైడ్‌గా మూవీ రిలీజ్ కానుండగా... అటు సోషల్ మీడియా ఇటు బాక్సాఫీస్ ఎక్కడ చూసినా బాలయ్య 'అఖండ 2' ఫీవరే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో లక్షల్లో టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్ చూస్తే... నార్త్ అమెరికాలో 12 వేల కంటే ఎక్కువగా టికెట్స్ సేల్ అయినట్లు సమాచారం.
మొత్తంగా ప్రీమియర్స్, ఫస్ట్ డే బుకింగ్స్ రెస్పాన్స్ చూస్తే.... తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ డే రూ.50 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకూ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నాయి. అన్నీ మేజర్ ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా... కొన్ని ప్రాంతాల్లో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ అయితే రికార్డు ఓపెనింగ్స్ పక్కా అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి బాలయ్య, బోయపాటి కాంబోలో నాలుగో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోందని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
Also Read : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
టికెట్ ధరల పెంపుపై...
ఈ నెల 5నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... వివిధ కారణాలతో వాయిదా పడింది. వారం రోజుల తర్వాత గురువారం ప్రీమియర్లతో థియేటర్లలోకి రానుంది. అయితే, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం ఇచ్చిన ధరల పెంపు జీవోను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ వేశారు. దీంతో ప్రత్యేక షోల నిర్వహణతో పాటు టికెట్ ధరలు పెంపుపై కోర్టు విచారణ చేయనుంది.
రిలీజ్‌కు ముందు సర్‌ప్రైజెస్
అటు రిలీజ్‌కు ముందు మూవీ టీం మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. బుధవారం టీజర్ రిలీజ్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా 'శివ శివ' అంటూ సాగే ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మూవీ విడుదలకు కొన్ని గంటల ముందే ఇలా పాట రిలీజ్ చేయడం విశేషం. బాలయ్యను సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మల్లన్న సేవలో మూవీ టీం
మరోవైపు, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ శ్రీశైలం మల్లన్నను గురువారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
View this post on Instagram





















