Kalki 2898 AD: నిలబడి మరీ చప్పట్లు కొట్టిన ప్రేక్షకులు - థియేటర్లలో ‘కల్కి 2898 AD’ క్రేజ్ మామూలుగా లేదుగా!
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD’ చూడడం కోసం చాలామంది ప్రేక్షకులు ఉదయం 4లోపే సంధ్య 70 ఎమ్ఎమ్ వద్దకు చేరుకున్నారు. ఇక షో ముగిసిన తర్వాత వారి రియాక్షన్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Kalki 2898 AD Movie Audience Reaction In Sandhya 70MM: జూన్ 27న ‘కల్కి 2898 AD’.. థియేటర్లలో విడుదల అని ప్రకటించినప్పటి నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగింది. ఉదయం 4 గంటల షో అంటే రాత్రి నుండి హడావిడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70mm థియేటర్‌లో ఏ స్టార్ హీరో సినిమా విడుదలయినా అది ఒక పండగలాగా ఉంటుంది. అలాగే ‘కల్కి 2898 AD’కు కూడా సంధ్య 70mm వద్ద రాత్రి నుండే రచ్చ స్టార్ట్ చేశారు ఫ్యాన్స్. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అంతే కాకుండా మొదటి షో పూర్తవ్వగానే ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
హాలీవుడ్ లెవెల్..
సంధ్య 70mmలో ‘కల్కి 2898 AD’ ఉదయం 4 గంటల షో పూర్తవ్వగానే థియేటర్లలోని ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లు కొట్టారు. ఈ మూమెంట్‌ను కూడా ఫ్యాన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘కల్కి 2898 AD’ని చూసిన తర్వాత ప్రభాస్‌ను, దర్శకుడు నాగ్ అశ్విన్‌ను తెగ ప్రశంసించేస్తున్నారు. కచ్చితంగా ఇది టాలీవుడ్‌లో తెరకెక్కిన హాలీవుడ్ లెవెల్ మూవీ అంటూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఉదయం 4 గంటల షో నుండి బయటికి రాగానే సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా ‘కల్కి 2898 AD’ పాజిటివ్ రివ్యూలతో నిండిపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఒక రేంజ్‌లో ఉండబోతున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Sandhya 70mm 💥💥#KALKI2898AD pic.twitter.com/B9fFbGj2dG
— RANJITH (@RanjithV06) June 27, 2024
టికెట్లు కష్టమే..
‘కల్కి 2898 AD’ని ఫస్ట్ డేనే చూడాలని చాలామంది ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అంతే కాకుండా ఉదయం 4 గంటల షోకు టికెట్ల కోసం పెద్ద యుద్ధమే చేశామంటూ వారి కష్టం గురించి చెప్పుకొచ్చారు. అలా అందరికంటే ముందే సినిమాను చూసినవారు.. అందరూ తప్పకుండా చూడాలంటూ రికమెండ్ చేయడం మొదలుపెట్టారు. కేవలం ఫస్ట్ డే మాత్రమే కాదు.. ‘కల్కి 2898 AD’ సినిమా కోసం ఫస్ట్ వీకెండ్ మొత్తం టికెట్లు దొరకడం కష్టమని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అయితే మూవీని ఒకసారి కాకుండా రెండు, మూడుసార్లు చూడడానికి కూడా సిద్ధమయిపోతున్నారు.
ఆశ్చర్యపరిచిన డైరెక్టర్..
ముఖ్యంగా ‘కల్కి 2898 AD’ విషయం నాగ్ అశ్విన్ డైరెక్షన్ చాలామందిని ఆశ్చర్యపరిచిందని ఆడియన్స్ అంటున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తానని, ప్రభాస్‌ను కొత్తగా చూపిస్తానని నాగ్ అశ్విన్ ముందే ఫ్యాన్స్‌కు మాటిచ్చాడు. కానీ మరీ ఈ రేంజ్‌లో ఉంటుందని ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ మాత్రమే కాదు.. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ పాత్రలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా కమల్ హాసన్ క్యారెక్టర్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు ప్రేక్షకులు. మధ్యలో వచ్చే గెస్ట్ రోల్స్ అయితే ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read: వారం రోజుల వరకు నా గొంతు పనిచేయదు - ‘కల్కి 2898 AD’పై రేణు దేశాయ్ రివ్యూ