అన్వేషించండి

Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్‌పై అర్జున్ రాంపాల్ భావోద్వేగం

బాలయ్య 'భగవంత్ కేసరి' మూవీలో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ నోట్ షేర్ చేస్తూ 'భగవంత్ కేసరి' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' మూవీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఓ స్పెషల్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ స్పెషల్ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ అంశాలను మేళవిస్తూనే ఓ సోషల్ మెసేజ్ ను ఈ సినిమాతో ప్రేక్షకులకు అందించారు అనిల్ రావిపూడి.

సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగు వెండితెరకి నటుడిగా పరిచయమయ్యారు. స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న 'భగవంత్ కేసరి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న క్రమంలో మూవీ టీం ఇప్పటికే సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించింది. ఇక తాజాగా సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరి మూవీకి సంబంధించి ఓ స్పెషల్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

"భగవంత్ కేసరి పై తమ ప్రేమను కురిపించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. మా టీం మొత్తానికి థాంక్స్. అనిల్ రావిపూడి మీరు చాలా ప్రతిభావంతులు. మీరు గిఫ్టేడ్. సాహు గారపాటి నన్ను నమ్మి నాకు ఎంతో మద్దతుగా నిలబడ్డారు. సెట్ లో చాలా టాలెంటెడ్ ఫన్ పర్సన్ అయిన శ్రీలీలతో మంచి టైం స్పెండ్ చేశాను. కాజల్ అగర్వాల్ మన సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అలాగే సినిమా యూనిట్ మొత్తం అద్భుతమైన భోజనాలు, ప్రేమ అందించినందుకు థ్యాంక్స్. అలాగే తమన్ కి కూడా థ్యాంక్స్. ముఖ్యంగా నాకు అందించిన ఒక అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ నన్ను చాలా ఆకట్టుకుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన భగవంత్ కేసరి నందమూరి బాలకృష్ణ బ్రో కి.. మీరు చాలా స్పెషల్.. ఐ కేర్ బ్రదర్, ఐ లవ్ యు" అంటూ రాస్కొచ్చారు.

'నాతో ఉన్నందుకు నా టీం శ్రీనివాస్, నవీన్, లక్ష్మణ్ కి కూడా థాంక్స్' అని తన స్పెషల్ నోట్ లో పేర్కొన్నారు అర్జున్ రాంపాల్. దీంతో అర్జున్ రాంపాల్ షేర్ చేసిన ఈ స్పెషల్ నోట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరోవైపు 'భగవంత్ కేసరి' మూవీ కేవలం ఆరు రోజుల్లోనే రూ.104 కోట్ల గ్రాస్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి సినిమాల తర్వాత 'భగవంత్ కేసరి'తో మరో రూ.100 కోట్ల హిట్ అందుకున్నారు బాలయ్య. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోల తర్వాత వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య నిలవడం విశేషం.

Also Read : ప్రభాస్‌ను పక్కన పెట్టి, షారుక్‌కు సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Phone Number Case : మూవీలో మొబైల్ నెంబర్ - నిర్మాతపై కేసు నమోదు... అసలేం జరిగిందంటే?
మూవీలో మొబైల్ నెంబర్ - నిర్మాతపై కేసు నమోదు... అసలేం జరిగిందంటే?
Horror Thriller Series OTT : హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
హాస్పిటల్ రూమ్ నెంబర్ 7లో ఏముంది? - మరింత భయపెట్టే 'రాతిరి'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Bhogi OTT : ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి భోగి - శర్వానంద్ యాక్షన్ మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
CM Chandrababu: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో విషాదం.. ఏపీకి చెందిన BSF జవాన్ మృతి- సీఎం చంద్రబాబు విచారం
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Aadarsha Kutumbam OTT : ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఆదర్శ కుటుంబం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
HMDA Miyapur Layout: మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
మియాపూర్‌లో HMDA మెగా లేఅవుట్.. 400 ఎకరాల్లో అన్ని వసతులతో భారీ ప్రాజెక్ట్.. త్వరలోనే ఈ-వేలం!
Flex Fuel Cars Bikes: ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల రిజిస్ట్రేషన్లలో బైకుల సంఖ్య 14,928, కార్లు కేవలం 23.. ఇదేందయ్యా ఇదీ!
ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో బైకులదే రాజ్యం.. కార్లను పట్టించుకున్నవాళ్లే లేకపాయ!
Rare Medical Case: వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
వైద్యశాస్త్రంలో అరుదైన ఘటన.. కడుపునొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన యువకుడు.. గర్భాశయం తొలగించిన డాక్టర్లు
Embed widget