అన్వేషించండి

Dil Raju: ప్రభాస్‌ను పక్కన పెట్టి, షారుక్‌కు సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు

షారుక్ ఖాన్ 'డంకీ' మూవీని సపోర్ట్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. షారుక్ 'డంకీ' నైజాం రైట్స్ ని దక్కించుకోవడంతో పాటు ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారట.

డిసెంబర్ నెలలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ ఖాన్, ప్రభాస్ తమ తమ సినిమాలతో పోటీ పడనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న 'సలార్', షారుక్ 'డంకీ' రెండు సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. 'పఠాన్', 'జవాన్' బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ ఖాన్ తదుపరి చిత్రంగా 'డంకీ' రాబోతుండడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. రాజ్ కుమార్ హిరానీతో షారుక్ చేస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీకి పోటీగా టాలీవుడ్ నుంచి 'సలార్' బాక్సాఫీస్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే 'సలార్' ని ఎదుర్కొనేందుకు షారుక్ టీం రంగం సిద్ధం చేస్తుంది. నిజానికి ఈ మూవీని మొదట డిసెంబర్ 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ కొరత ఏర్పడుతుంది. అందుకే సలార్ కంటే ఒక్కరోజు ముందు డిసెంబర్ 21న 'డంకి' ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్ సినిమాను సపోర్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి దిల్ రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 'డంకి' చిత్రానికి తెలుగులో థియేటర్స్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు అగ్ర నిర్మాత దిల్ రాజు సాయం తీసుకుంటున్నారట మూవీ టీం.

అంతేకాదు డంకీ నైజాం హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేసుకోబోతున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే దిల్ రాజుతో షారుక్ ఖాన్ టీమ్ మాట్లాడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క 'సలార్' మూవీని మైత్రి నిర్మాతలు పంపిణీ చేస్తున్నారు. థియేటర్స్ పరంగా సలార్ తో తలపడాలంటే దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయితేనే బెస్ట్ అని షారుఖ్ ఖాన్ టీమ్ భావించిందట. అయితే 'డంకి' రైట్స్ అమ్ముతున్నారా? లేక కేవలం రిలీజ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారా? అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఏదేమైనా 'డంకీ' నైజాం రైట్స్ ని దిల్ రాజు దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.

ఈ విషయం తెలిసిన పలువురు సినీ విశ్లేషకులు ప్రభాస్ లాంటి డైనోసార్ ని ఎదుర్కోవాలంటే 'డంకీ' టీమ్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదని అంటున్నారు. సలార్ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారుడు విలన్ గా రోల్ ప్లే చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : ఓటీటీలో దూసుకెళ్తోన్న 'ఖుషి' - ఏకంగా టాప్ 10లో స్థానం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget