అన్వేషించండి

Raghu Thatha: విప్లవం సృష్టించడానికి వచ్చేస్తున్న కీర్తి సురేశ్ - ‘రఘు తాత’ నుంచి మరో గ్లింప్స్ విడుదల

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఈ జెనరేషన్‌లో కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది కీర్తి సురేశ్. అందుకే ‘రఘు తాత’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఒక హీరోయిన్‌కు ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా గుర్తింపు లభిస్తే చాలు.. ఇక మేకర్స్ అంతా తనకు బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ కథలనే వినిపిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలకు సూట్ అయ్యే నటి కీర్తి సురేశ్. ‘మహానటి’లాంటి చిత్రంతో తన నటన ప్రతిభ ఏంటో అందరికీ చూపించిన ఈ భామ.. ఇప్పుడు మరొక లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘రఘు తాత’. హోంబేల్ ఫిల్మ్స్ లాంటి పాపులర్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక గ్లింప్స్ విడుదలయ్యింది.

కయల్విరి వచ్చేస్తుంది..
ఇప్పటికే ‘రఘు తాత’ నుంచి కీర్తి సురేశ్ క్యారెక్టర్ గ్లింప్స్ విడుదలయ్యింది. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో కీర్తి.. ఒక టీచర్ పాత్రలో కనిపించనుందని స్పష్టమవుతోంది. ఇక తాజాగా విడుదలయిన మరో గ్లింప్స్ కూడా ఒక స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంది. ముందుగా ఈ గ్లింప్స్‌లో ఒక బోర్డ్‌పై ‘హిందీ వర్డ్ ఆఫ్ ది డే’ అని ఉండి.. దాని కింద ‘పరీక్ష’ అని రాసుంటుంది. ఆ తర్వాత కీర్తి సురేశ్ వచ్చి హిందీ, పరీక్ష రెండు పదాలను చెరిపేస్తుంది. అప్పుడే ఆ బోర్డ్‌పై ‘రఘు తాత’ అని టైటిల్ కనిపిస్తుంది. హోంబేల్ ఫిల్మ్స్.. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘మిమ్మల్ని నవ్వించడానికి, మీ మనసులు గెలుచుకోవడానికి, ఒక విప్లవం సృష్టించడానికి మీ కయల్విరి సిద్ధమయ్యింది. రఘు తాతకు సిద్ధమవ్వండి. త్వరలోనే మీ అభిమాన థియేటర్లలో’ అంటూ క్యాప్షన్‌తో ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది హోంబేల్ ఫిల్మ్స్.

ఆ సినిమాలోని సీన్ ఆధారంగా..
‘రఘు తాత’ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేశ్‌తో పాటు ఎమ్ఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాజేశ్ బాలకృష్ణన్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షేన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. 1981లో భాగ్యరాజ్ తెరకెక్కించిన ప్రముఖ తమిళ చిత్రం ‘ఇండ్రు పోయి నాలై వా’ సినిమాలోని ఒక ప్రముఖ కామెడీ సీన్ ఆధారంగా ‘రఘు తాత’ తెరకెక్కిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీన్‌లో టీచర్‌గా ఉండే రాధికా శరత్‌కుమార్.. స్టూడెంట్స్‌కు హిందీ పదాన్ని నేర్పించాలనుకుంటారు. కానీ పిల్లలు అది వినకుండా ‘రఘు తాత’ అని గోల చేస్తారు. అప్పట్లో ఈ సీన్ కోలీవుడ్ ప్రేక్షకులను తెగ నవ్వించగా.. ఇప్పుడు దానిని ఆధారంగా ఏకంగా ఒక సినిమా కథే పుట్టుకొచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hombale Films (@hombalefilms)

ఏకంగా నాలుగు సినిమాలు..
లేడీ ఓరియెంటెడ్ కథలకు సరిగ్గా సరిపోయే హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ‘మహానటి’ తర్వాత తను చేసిన ఏ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా హిట్ అవ్వలేదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కీర్తికి హిట్లు ఇస్తూ వచ్చాయి. తాజాగా నాని సరసన నటించిన ‘దసరా’ మూవీలో కీర్తి నటన.. మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటించిన ‘భోలా శంకర్’ మాత్రం డిజస్టర్ అయ్యింది. అలా ఒకే ఏడాదిలో ఒక క్లీన్ హిట్, ఒక ఫ్లాప్ చూసిన కీర్తి.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అందులో ‘రఘు తాత’ కూడా ఒకటి. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుందని చెప్పిన మేకర్స్.. రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.

Also Read: పొరపాటున బాయ్‌ఫ్రెండ్ పేరును బయటపెట్టేసిన జాన్వీ - ఆ మాజీ సీఎం కొడుకేనట!

టాప్ హెడ్ లైన్స్

NTR Anil Ravipudi : ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?
ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఫుల్ కామెడీ ట్రీట్ - టైటిల్ ఏమై ఉంటుందో?
Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - మిస్ కాకుండా చూడాల్సిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవంటే?
Giri Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
Dhindora Series Season 2 OTT : మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
మామకు కొత్త కష్టాలు! - డబుల్ డోస్‌తో కామెడీ సిరీస్ 'ఢిండోరా' సీజన్ 2... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget