Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శకునములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్
నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రం నుంచి శ్రీరామనవమి సందర్భంగా ఓ ప్లెజెంట్ సాంగ్ రిలీజైంది... పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట ఫ్యామిలీతో పాటు యూత్ నూ ఆకర్షిస్తోంది...
Anni Manchi Sakunamule : 'శ్రీరామనవమి' సందర్భంగా టాలీవుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' చిత్రం నుంచి మూవీ మేకర్స్ ఓ మెమోరేబుల్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'నందినీ రెడ్డి' దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో హీరో గా సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తు్న్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ పాట ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.
నాని 'అలా మొదలైంది', సమంత 'ఓ బేబీ' వంటి మంచి హిట్స్ ఇచ్చిన ఉమెన్ డైరెక్టర్ నందినీ రెడ్డి లేటెస్ట్ గా ఓ ఫ్యామిలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'అన్నీ మంచి శకునములే'.. టైటిల్ తో.. 'ఈ సారి వేసవికి చల్లని చిరుగాలి' అన్న క్యాప్షన్ తో రూపు దిద్దుకున్న ఈ మూవీలో హీరో, హీరోయిన్లుగా సంతోష్ శోభన్, మాళవికా నాయర్ నటిస్తుండగా.. స్వప్న సినిమాస్ - వైజయంతి మూవీస్ బ్యానర్లపై నిర్మిస్తు్న్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్, ఓ పాటకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజైన సీతా కళ్యాణం అనే పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనదిగా భావించే పెళ్లి నేపథ్యంలో ఈ సాంగ్ ను రూపొందించారు. కుటుంబసమేతంగా జరిగే వివాహంలో సంతోషంతో పాటు భావోద్వేగాలు, ప్రేమ, ఆప్యాయతలూ ఉంటాయని ఈ పాటలో చక్కగా చూపించారు. దీంతో యూట్యూబ్ లోనూ ఈ సాంగ్ కు మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా రిలీజైన 'సీతా కళ్యాణం..' సాంగ్ ను సినీ రచయిత చంద్రబోస్ రాశారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ పాటను ఛైత్ర అండిపూడి, శ్రీకృష్ణ పాడారు. అంతే కాకుండా ఈ సినిమాలో సీనియర్ నటులు నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. స్వప్నాదత్, ప్రియాంకా దత్ మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోవడంతో.. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మే 18న వేసవి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న సంతోష్ శోభన్ విషయానికొస్తే.. ఈయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. 2011లో రిలీజైన 'గోల్కొండ హైస్కూల్' చిత్రం ద్వారా బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 2015లో "తను నేను" చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ’ చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకూ సంతోష్ చేసినవి కొన్ని సినిమాలే అయినా.. మంచి క్యారెక్టర్స్ రావడం చెప్పుకోదగిన విషయం. ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరవుతారని ఆయన ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.