అన్వేషించండి

Pushpa 2 - Bhool Bhulaiyaa 3: ‘భూల్ భూలయ్యా 3‘ To ‘పుష్ప: ది రూల్’- ‘సింగం ఎగైన్’ను దెబ్బకొట్టేందుకు అనిల్ తడాని మాస్టర్ ఫ్లాన్

త్వరలో ‘భూల్ భూలయ్యా 3’, ‘పుష్ప 2’ని ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో అనిల్ తడాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాలకు ప్రాధానత్య ఇచ్చేలా ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

Anil Thadani Movies: ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేజిక్కించుకుంటూ సత్తా చాటుతున్నారు. సౌత్ ఇండియన్ పాన్ ఇండియన్ చిత్రాలన్నింటీ హిందీ థియేట్రికల్ రైట్స్ ఆయనే దక్కించుకుంటున్నారు. గత కొంత కాలంగా సౌత్ సినిమాల పట్ల నార్త్ ఇండియాలో విపరీతమైన ఆదరణ నెలకొన్న నేపథ్యంలో.. తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ రిలీజ్ రైట్స్ ను ఆయనే సొంతం చేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ రైట్స్ కోసం నార్త్ లో గట్టి పోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాలని AA ఫిలిమ్స్ హిందీలో రిలీజ్ చేస్తున్నది. అనిల్ తడాని ఈ సినిమాల రిలీజ్ రైట్స్ ను ఫ్యాన్సీ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

‘పుష్ప 2’, ‘గేమ్ ఛేంజర్’ కూడా అనిల్ ఖాతాలోకే..

ఇప్పటికే ప్రముఖ సంస్థలతో కలిసి ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘కాంతార’, ‘KGF’, ‘కల్కి 2898 ఏడీ’ సహా ‘దేవర’ సినిమాలను అనిల్ తడాని నార్త్ లో డబ్ చేసి విడుదల చేశారు. అల్లు అర్జున్ ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప ది రూల్’ మూవీ రైట్స్ కూడా ఆయనే దక్కించుకున్నారు. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రాన్ని నార్త్ లో రిలీజ్ చేయబోతున్నారు. బాలీవుడ్ మూవీ ‘భూల్ భూలయ్యా 3’ సినిమాను కూడా ఆయనే రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా అనిల్ ఖాతాలోనే పడింది. ఈ నేపథ్యంలో  ఆయన దేశవ్యాప్తంగా ఎగ్జిబిటర్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రారంభించాడు. సింగిల్ స్క్రీన్లు, నాన్-నేషనల్ చైన్‌ల కోసం ఒక జాయింట్ టీమ్‌ను ఆఫర్ చేస్తున్నాడు. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ మూవీ ‘సింగం ఎగైన్‌’తో పోల్చితే తన సినిమాలు ఎక్కువగా ప్రదర్శించేలా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు.  ఒకే రోజు ‘భూల్ భూలయ్య 3’, ‘సింగం ఎగైన్’ సినిమాలు నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తన సినిమా ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

‘భూల్‌ భులయ్యా 3’ గురించి..

కార్తీక్‌ ఆర్యన్‌, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో ‘భూల్‌ భులయ్యా 3’ తెరకెక్కింది. హారర్, కామెడీ, థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ‘భూల్‌ భులయ్యా’ ప్రాంఛైజీలో రెండు సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో మూడో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ సినిమాలో విద్యా బాలన్‌, మాధురీ దీక్షిత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని అనీస్‌ బజ్మీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల తర్వాత  ‘భూల్ భూలయ్యా 3’ సినిమాతో విద్యా బాలన్ నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నవంబర్ 1న విడులకు రెడీ అవుతోంది. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

‘పుష్ప 2’ గురించి..

‘పుష్ప 2’లో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్‌ గా నటిస్తున్నాడు.  అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.

Read Also: జనక అయితే గనక ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్లు ఏమంటున్నారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget