అన్వేషించండి

Anil Ravipudi: అనిల్ రావిపూడికి కారు బహుమతిగా ఇచ్చిన ‘భగవంత్ కేసరి’ నిర్మాత - ధర ఎంతంటే?

‘భగవంత్ కేసరి’లాంటి హిట్‌ను అందించడంతో అనిల్ రావిపూడికి కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చారు నిర్మాతలు. ప్రస్తుతం ఆ కారు ధర గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Bhagavanth Kesari Movie : సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. మామూలుగా ట్రెండ్ అనేది ఎవరు ప్రారంభించినా కూడా కొన్నాళ్ల వరకు అందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు. ఇక కొంతకాలంగా సినీ పరిశ్రమలో నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే.. ఒక సినిమా హిట్ అవ్వగానే దానికి సంబంధించిన డైరెక్టర్ లేదా హీరో లేదా హీరోయిన్‌కు కార్లను లేదా ఇంకేదైనా కాస్ట్‌లీ ఐటెమ్స్‌ను బహుమతులుగా ఇవ్వడం. తాజాగా మరో డైరెక్టర్ కూడా తమ నిర్మాత దగ్గర నుంచి ఒక పాష్ కార్‌ను బహుమతిగా అందుకున్నారు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. అనిల్ రావిపూడి.

‘భగవంత్ కేసరి’ తెచ్చిపెట్టిన గిఫ్ట్..
అనిల్ రావిపూడి.. తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కామెడీ కమర్షియల్ సినిమాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరించాడు. పైగా తను తీసిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. దీంతో డైరెక్టర్‌గా కొద్దికాలంలోనే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు అనిల్. అలాంటి కామెడీ దర్శకుడు.. బాలకృష్ణలాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ చేయగానే.. బాలయ్య సినిమా నుంచి తన ఫ్యాన్స్ ఆశించే యాక్షన్, ఫైట్స్.. ఇందులో ఉండవని అందరూ అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కథతో ‘భగవంత్ కేసరి’లాంటి చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. థియేటర్లలో హిట్ అయిన ఈ సినిమా.. ఓటీటీలో కూడా విడులదయ్యి హిట్ టాక్‌ను సంపాదించుకుంటుండగా.. ఈ మూవీ నిర్మాత ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీంతో అనిల్‌కు కాస్ట్‌లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

కోటికి పైగా విలువ చేసే కారు..
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరిష్ పెద్ది కలిసి ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో అనిల్ రావిపూడికి టయెటా వెల్‌ఫైర్ కారును బహుమతిగా అందించారు సాహూ గారపాటి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ కారు విలువ రూ. కోటిపైనే ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఏడు సినిమాలు హిట్ కొట్టినా కూడా ఇప్పటివరకు అనిల్‌కు ఇలాంటి బహుమతి అందలేదని తన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్షన్స్ ఎంతంటే..?
‘భగవంత్ కేసరి’ సినిమా కేవలం ప్రేక్షకుల ఆదరణ పొందడం మాత్రమే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులు తిరగరాయడం బాలయ్య ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.58 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రూ.67.35 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది ఈ మూవీ. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ‘భగవంత్ కేసరి’.. 18 రోజుల్లోనే రూ.139.19 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు సమాచారం. బాలకృష్ణతో పాటు ఈ సినిమాలో శ్రీలీల మరో కీలక పాత్రలో నటించింది. బాలయ్యకు జంటగా కాజల్ కనిపించింది. ఇక ఈ సినిమాతో పెళ్లి తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్. అంతే కాకుండా కాజల్‌తో పాటు శ్రీలీల కూడా ముందెన్నడూ చేయని క్యారెక్టర్లు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా శ్రీలీల క్యారెక్టర్‌కు ప్రేక్షకుల దగ్గర నుంచి విశేష ఆదరణ లభించింది. విలన్‌గా అర్జున్ రాంపాల్ కూడా తన యాక్షన్‌తో ప్రశంసలు పొందారు.

Also Read: ఈ ఇయర్ బెస్ట్ మూవీ ఇదే, మమ్ముట్టి చిత్రంపై సమంత ప్రశంసలు

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Anna Konidela Visits Thirumala: పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
నోలన్ 'The Odyssey 'లో రామాయణ, మహాభారత పోలికలు: వైరల్ అవుతున్న 3 సారూప్యతలు!
Oh Sukumari Box Office Collection Day 1: ఫ్లాప్ టాక్‌తో 'సుకుమారి'కి సూపర్ కలెక్షన్స్... తిరువీర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
ఫ్లాప్ టాక్‌తో 'సుకుమారి'కి సూపర్ కలెక్షన్స్... తిరువీర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget