అన్వేషించండి

Ameesha Patel: అమీషా పటేల్ దగ్గర అత్యంత ఖరీదైన బ్యాగ్ - దాని ధరతో ఒక ఇల్లు కొనేయొచ్చట!

లగ్జరీ బ్యాగ్స్, లగ్జరీ కార్స్.. ఇవన్నీ ఫ్యాషన్ ఐకాన్, స్టైల్ సింబుల్ అన్నట్టుగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. అందుకే ఇలాంటివి కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

చాలామంది సినీ సెలబ్రిటీలు ఎక్కువగా లగ్జరీ వస్తువులను కొనడానికి, ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. వాటినే ఫ్యాషన్ ఐకాన్‌లాగా ఫీల్ అవుతుంటారు. అది చూసి వారి ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవుతుంటారు. వారిలాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ సినీ సెలబ్రిటీలు ఉపయోగించే కొన్ని వస్తువులు ఒక మామూలు మిడిల్ క్లాస్ మనిషికి చాలా పెద్ద విషయం. తాజాగా ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న అమీషా పటేల్.. తాజాగా ఒక లగ్జరీ బ్యాగ్ కొనుగోలు చేసింది. దానికి అయిన ఖర్చు గురించి చెప్తూ ఒక ఇల్లు కొనుక్కోవచ్చు అంటూ కామెడీ చేసింది. 

16 లగ్జరీ బ్యాగ్స్ ఉన్నాయి..
సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్‌కు లగ్జీరీ బ్యాగ్స్ అంటే ముందు నుండే చాలా ఇష్టం. 12 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి అమీషాకు లగ్జరీ బ్యాగ్స్ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో బయటపెట్టింది. తాజాగా అమీషా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ గురించి చెప్తూ అది దాదాపుగా ఒక ఇల్లు ధరతో సమానమని చెప్పుకొచ్చింది. తన దగ్గర ఒక బిర్కిన్ బ్యాగ్ ఉందని, ప్రస్తుతం దాని ధర రూ.60 నుంచి 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. అలా తన కలెక్షన్‌లో మొత్తంగా 16 బిర్కిన్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి అందరికీ షాకిచ్చింది.

హాలీవుడ్ సెలబ్రిటీలతో పోలిస్తే తక్కువే..
బిర్కిన్ బ్యాగ్స్ అనేవి బ్యాగ్స్‌లోనే రోల్స్ రాయిస్‌లాంటివి అని అమీషా పటేల్ వివరించింది. చాలామంది వెయిట్‌లిస్ట్‌లో ఈ బ్యాగ్ ఉంటుందని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఆ బ్యాగ్ గురించి మాట్లాడుతున్న అమీషా.. ‘నా దగ్గర ఒక క్రాక్ బిర్కిన్ ఉంది. బిర్కిన్‌ బ్రాండ్‌లో అనేక షేప్స్ ఉన్న బ్యాగ్స్ కూడా ఉంటాయి. కానీ అవి దొరకడం కష్టంగా ఉంటాయి. అలాంటి బ్యాగులు కొనే ఖర్చతో ఒక ఇల్లు కొనవచ్చు.’ అని తెలిపింది. అయితే తను ఉపయోగించే బ్యాగ్స్.. కొందరు హాలీవుడ్ సెలబ్రిటీలు ఉపయోగించే బ్యాగ్స్‌తో పోలిస్తే చీప్ అని అమీషా అంటోంది. రిహాన్నా, విక్టోరియా బెక్హామ్ దగ్గర ఉన్న లగ్జరీ బ్యాగ్స్‌కు దాదాపు వజ్రాల లాంటి ధరలు ఉంటాయని తెలిపింది.

పిల్లలతో సమానం..
అమీషా పటేల్.. తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్ చూపిస్తూ వాటి గురించి వివరించింది. ఒక బ్యాగ్ సైజ్ 35, ఒక బ్యాగ్ సైజ్ 30 అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన దగ్గర ఉన్న అతిపెద్ద బ్యాగ్ సైజ్ 40 అంటూ చెప్పుకొచ్చింది. బ్రాండ్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ కాకుండా తనకు తాను కస్టమైజ్ చేసుకున్న బ్యాగ్స్ కూడా ఉన్నాయంటూ చూపించింది. దాదాపు సంవత్సరం పాటు కష్టపడి పింక్, బ్లూ కాంబినేషన్ కలిపి, దానికి గోల్డ్ ఫినిష్ ఇచ్చానని అమీషా చెప్పుకొచ్చింది. పిల్లలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో.. తను తన బ్యాగ్స్‌ను అలా కాపాడుకుంటానని ఫన్నీగా పోల్చింది అమీషా పటేల్. తన దగ్గర బ్యాగ్స్ చాలావరకు లిమిటెడ్ ఎడిషన్స్ అని తెలిపింది. 2000 సంవత్సరంలో విడుదలయిన ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో అమీషా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గదర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా విడుదలయిన ఆ మూవీ సీక్వెల్ ‘గదర్ 2’ కూడా అమీషాకు కావాల్సిన హిట్‌ను అందించి, తన కెరీర్‌ను మళ్లీ ఫార్మ్‌లోకి తీసుకొచ్చింది.

Also read: హౌస్‌మేట్స్‌, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన ‘మొండి’ రతిక - బూతులు తిట్టిన అమర్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Tremors in India:ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
ఉత్తరాదిలో కంపించిన భూమి - భారత్‌సహా పలు దేశాలపై యమన్మార్‌ భూకంపం ప్రభావం  
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake Videos: గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
Viral News: ఇద్దర్ని ప్రేమించాడు .. గొడవల్లేకుండా ఇద్దర్నీ  పెళ్లి చేసుకున్నాడు -  ఈ దశాబ్దాపు లవర్ ఇతడే !
ఇద్దర్ని ప్రేమించాడు .. గొడవల్లేకుండా ఇద్దర్నీ పెళ్లి చేసుకున్నాడు - ఈ దశాబ్దాపు లవర్ ఇతడే !
Embed widget