అన్వేషించండి

బిహార్ ఎన్నికలు 2025

(Source:  ECI | ABP NEWS)

Allu Arjun: అల్లు అర్జున్ 'ఐకాన్' స్క్రిప్ట్‌తో నితిన్ మూవీ? అసలు విషయం ఇదే!

వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గతంలో అల్లు అర్జున్తో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇదే సినిమాని అల్లు అర్జున్తో కాకుండా నితిన్ తో చేస్తున్నాడట ఈ దర్శకుడు.

'వకీల్ సాబ్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు వేణు శ్రీరామ్ ఇప్పటివరకు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించలేదు. నిజానికి వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ 'ఐకాన్' అనే ప్రాజెక్టు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు. రీసెంట్ గా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని చెప్పారు. కానీ దానిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. దాంతో 'ఐకాన్' ప్రాజెక్టు లేదని అంతా అనుకున్నారు. కానీ వేణు శ్రీరామ్ ఇప్పుడు అదే సినిమాని నితిన్ తో చేస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారట. 'వకీల్ సాబ్' కంటే ముందే అల్లు అర్జున్తో 'ఐకాన్' అనే ప్రాజెక్టును అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు వేణు శ్రీరామ్. కానీ ఆ తర్వాత 'వకీల్ సాబ్' తో బిజీ అయిపోయాడు. దాంతో బన్నీ కూడా ఆ ప్రాజెక్టు పై ఇంట్రెస్ట్ చూపించలేదు. అటు వేణు శ్రీరామ్ కూడా ఐకాన్ ప్రాజెక్టు పక్కన పెట్టేశాడు.

అయితే తాజాగా వేణు శ్రీరామ్ తన నెక్స్ట్ మూవీకి స్టోరీ రెడీ చేసుకున్నారట. దాన్ని రీసెంట్ గా నితిన్ కి వినిపించాడట. నితిన్ కూడా కథ విని ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ని వేణు శ్రీరామ్ రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట వేణు శ్రీరామ్. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వేణు శ్రీరామ్ నితిన్ తో చేయబోయే ప్రాజెక్ట్ గతంలో అల్లు అర్జున్తో చేయాల్సిన 'ఐకాన్' ప్రాజెక్టే అని చెబుతున్నారు. కాకపోతే 'ఐకాన్' కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి నితిన్ ఇమేజ్కు సూటయ్యే విధంగా వేణు శ్రీరామ్ స్క్రిప్ ను రెడీ చేసినట్లు సమాచారం.త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

తాజాగా తనకు 'భీష్మ' వంటి హిట్ అందించిన వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. 'VNR Trio'  వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీలో నితిన్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైన షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ కెరియర్ లో 32వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి శ్రేష్ట మూవీ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాకి హారీష్ జైరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read: ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’ సినిమా - కోర్టును ఆశ్రయించిన నరేష్ భార్య రమ్య రఘుపతి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో ఎన్డీఏ 190కి పెరిగింది, ఎంజీబీ 50కి పడిపోయింది
బిహార్‌లో ఎన్డీఏ 190కి పెరిగింది, ఎంజీబీ 50కి పడిపోయింది
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Tirumala: టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
Advertisement

వీడియోలు

Jubilee Hills By Election Results 2025 | దూసుకుపోతున్న కాంగ్రెస్
Jubilee hills Election Result 2025 | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ దే ఆధిక్యం...జూబ్లీహిల్స్ పీఠం ఎవరిదో.? | ABP Desam
Ruturaj Gaikwad Century vs South Africa A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Ruturaj gaikwad Century vs SA A | ఛాన్స్ దొరికితే సెంచరీ కొట్టి గంభీర్ నే క్వశ్చన్ చేస్తున్న రుతురాజ్
Ind vs SA First Test Match Preview | సౌతాఫ్రికాతో నేటి నుంచి మొదటి టెస్ట్ లో తలపడనున్న భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election Result 2025 LIVE: బిహార్‌లో ఎన్డీఏ 190కి పెరిగింది, ఎంజీబీ 50కి పడిపోయింది
బిహార్‌లో ఎన్డీఏ 190కి పెరిగింది, ఎంజీబీ 50కి పడిపోయింది
Jubilee Hills By Election Results 2025:  జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం- రప్పా రప్పా, తగ్గేదేలే అంటున్న నాయకులు
Dude OTT: 'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
'డ్యూడ్' ఓటీటీ స్ట్రీమింగ్... ఒక్కటి కాదు, ఐదు భాషల్లో - ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు సినిమా ఎందులో ఉందంటే?
Tirumala: టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
టీటీడీ AI చాట్‌బాట్! ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులభం – 13 భాషల్లో సమాచారం!
Jubilee Hills By Poll Results 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తోన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! పూర్తిగా సైడైన బీజేపీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దూసుకెళ్తోన్న నవీన్ యాదవ్.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్! పూర్తిగా సైడైన బీజేపీ
Delhi Blast Case Update: ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ ఉమర్ ఇంటిని పేల్చివేసిన భద్రతా బలగాలు
ఢిల్లీ పేలుడు మాస్టర్ మైండ్ ఉమర్ ఇంటిని పేల్చివేసిన భద్రతా బలగాలు
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Riddhi Kumaar: ప్రభాస్ 'రాజా సాబ్'లో హీరోయిన్... మిర్రర్ సెల్ఫీల్లో ఎలా ఉందో చూశారా?
ప్రభాస్ 'రాజా సాబ్'లో హీరోయిన్... మిర్రర్ సెల్ఫీల్లో ఎలా ఉందో చూశారా?
Embed widget