అన్వేషించండి

Allu Arjun: సుకుమార్‌పై అల్లు అర్జున్ ఆగ్రహం? విభేదాలకు కారణాలేమిటీ?

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 1’ విడుదలయ్యి రెండేళ్లకు పైగా అయ్యింది. అయినా ‘పుష్ప 2’పై విడుదల కాకపోవడంతో వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని సమాచారం.

Pushpa 2 Release Date: ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఎన్నో పాన్ ఇండియా సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి. అందులో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఈ సినిమా మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్’ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే దీని సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. కానీ ‘పుష్ప ది రూల్’ మాత్రం పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. ఇదే సమయంలో అల్లు అర్జున్, సుకుమార్ విభేదాలు కూడా వస్తున్నట్టు టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 

ఆగస్ట్ 15 కోసం వెయిటింగ్..

2021 డిసెంబర్‌లో ‘పుష్ప ది రైజ్’ విడుదలయ్యింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ప్రీ ప్రొడక్షన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు దర్శకుడు సుకుమార్. ‘పుష్ప పార్ట్ 1’ కంటే పార్ట్ 2ను మరింత భారీ ఎత్తులో నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదని జాగ్రత్తపడుతున్నాడు. ఇదే క్రమంలో ‘పుష్ప 2’ షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఎంత లేట్ అయినా కూడా 2023 డిసెంబర్‌లో ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అది కూడా కుదరలేదు. ఏకంగా 2024 ఆగస్ట్ 15కు మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్‌లో నిరాశ ఎక్కువయ్యింది. 

ఆ విషయంలో అల్లు అర్జున్ సీరియస్..

మామూలుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన సినిమాకు ఒక విడుదల తేదీని ప్రకటిస్తే.. కచ్చితంగా అదే రోజు మూవీ ఎట్టి పరిస్థితుల్లో విడుదల అవ్వాలని కోరుకునే వ్యక్తి. కానీ తన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఏదో ఒక విధంగా షూటింగ్ లేట్ అవ్వడం లేదా షూటింగ్‌కు బ్రేక్ పడడంలాంటివి జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల అల్లు అర్జున్ కూడా సుకుమార్‌పై ఆగ్రహంగా ఉన్నాడని ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమార్ అంటే అల్లు అర్జున్‌కు చాలా ఇష్టం. ఇదే విషయం బన్నీ కూడా పలుమార్లు ఓపెన్‌గా చెప్పాడు. కానీ ‘పుష్ప 2’ వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. 

2025 సమ్మర్‌కే..

ఒకవేళ ఆగస్ట్ 15 లోపు ‘పుష్ప 2’ షూటింగ్ పూర్తి అయ్యి.. విడుదలకు సిద్ధమవ్వకపోతే.. ఇంక ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు. ఎందుకంటే 2024లో ఇప్పటికే పలుమార్లు సినిమాల విడుదల తేదీల గురించి చర్చలు జరిగాయి. ఉన్న విడుదల తేదీని మిస్ చేసుకుంటే ‘పుష్ప 2’కు మళ్లీ రిలీజ్ డేట్ దొరకడం కష్టమని, దానికోసం కష్టాలు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2024 క్రిస్ట్మస్, 2025 సంక్రాంతి పూర్తిగా సినిమాలతో ప్యాక్ అయిపోయింది. అందుకే ఆగస్ట్ 15న ‘పుష్ప 2’ థియేటర్లలో విడుదల అవ్వకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ తప్పదు. అందుకే వారిని నిరాశకు గురిచేయకూడదని, ఎలాగైనా సినిమాను అనుకున్న సమయానికే విడుదల చేయాలని బన్నీ ఒత్తిడి చేస్తున్నాడట.

Also Read: ‘గేమ్ ఛేంజర్’ మరింత ఆలస్యం? వినాయక చవితికి కూడా విడుదల కానట్టేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్
ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్
Trisha Reaction : స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్
స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్
Gasagasalu: వంటింట్లో, కూరల్లో మత్తుమందు... ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ గసగసాల కోసమేనా?
వంటింట్లో, కూరల్లో మత్తుమందు... ఎన్టీఆర్ 'డ్రాగన్' కథ గసగసాల కోసమేనా?
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?

వీడియోలు

RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్
David Warner Blocked by SRH ? | డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH?
IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్
Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Expansion 2026: కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
కేంద్రమంత్రివర్గంలో సంచలన మార్పులు - కొంత మంది సీఎంలను కేంద్రమంత్రుల్ని చేయబోతున్నారా?
Hyderabad Crime News: హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
హైదరాబాద్‌ నుంచి పాక్ ఐఎస్ఐతో ఛాటింగ్.. యూపీ యువకుడి అరెస్ట్.. గన్స్‌తో రీల్స్ వైరల్ కావడంతో ట్రాప్!
Pawan Kalyan Politics: జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
జనసేనకు పవన్ కళ్యాణ్ మార్క్ రిపేర్లు.. క్షేత్రస్థాయి పర్యటనలు మొదలుపెట్టిన డిప్యూటీ సీఎం
Heatwave In AP And Telangana: వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
వడదెబ్బతో ఒక్కరోజే 76 మంది మృతి.. ఏపీలో 48.3 డిగ్రీలు, తెలంగాణలో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత!
Maa Inti Bangaram Trailer: సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
Best Mileage Cars: పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
పెట్రోల్ ఎక్కువ ఆదా చేసే టాప్ 5 బెస్ట్ మైలేజీ కార్లు ఇవే..
YSRCP Political Strategy Failures: వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి!
వ్యూహాత్మక తప్పిదమా? లేక సెల్ఫ్ గోల్స్? జగన్ ప్రెస్ మీట్లు ఎందుకు బెడిసికొడుతున్నాయి?
Kia India Announces Massive Discounts: కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
కియా కార్లపై అదిరిపోయే మే ఆఫర్స్ - మోడళ్లపై రూ. 2.70 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Embed widget