అన్వేషించండి

Allu arjun: బన్నీ, చెర్రీ మధ్య స్టార్ వార్ - ఒక్క పోస్ట్‌తో ఆ వార్తలకు చెక్ పెట్టిన అల్లు అర్జున్ భార్య

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య స్టార్ వార్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై అల్లు అరవింద్, అలాగే చిరంజీవి లు పలు సందర్భాల్లో క్లారిటీ  ఇచ్చారు.

Allu arjun: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి కూడా అల్లు అర్జున్, అల్లు శిరీష్ లాంటి వారు ఇండస్ట్రీలోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ బంధువులు కావడంతో.. వీరంతా ఒకే కుటుంబంలా ఉంటారు. అయితే ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య స్టార్ వార్ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై చరణ్, బన్నీలు స్పందించకపోయినా అల్లు అరవింద్, అలాగే చిరంజీవి లు పలు సందర్భాల్లో క్లారిటీ  ఇచ్చారు. తాము వృత్తి పరంగా ఎవరి పని వాళ్లు చేసుకుంటామని, కానీ కుటుంబం విషయంలో తామంతా ఒకటేనని చెప్పారు కూడా. అయినా ఈ స్టార్ వార్ వార్తలు ఆగలేదు. దానికి తోడు ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు అల్లు అర్జున్ విషెస్ చెప్పకపోవడం, బర్త్ డే పార్టీలో కనబడకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అయితే తాజాగా బన్నీ భార్య స్నేహారెడ్డి ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఇంతకీ అల్లు స్నేహారెడ్డి చేసిన పోస్ట్ ఏమిటంటే.. ఇటీవల అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ సిస్టర్స్ శ్రీజ, సుష్మిత ఇంకొంత మంది కజిన్స్ తో కలసి వెకేషన్ కు వెళ్లారు. అక్కడ వారు సరదాగా గడిపిన వీడియోలు, ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దానికి ‘లవ్ ఫ్యామిలీ’ అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చింది. నిజంగా బన్నీ- చెర్రీల మధ్య స్టార్ వార్ నడిస్తే రామ్ చరణ్ సిస్టర్స్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎందుకు వెళ్తారు అని అంటున్నారు అభిమానులు. బర్త్ డే పార్టీకు రానంత మాత్రాన ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ఎలా రాస్తారని ఫైర్ అవుతున్నారు. వాళ్లు బాగానే ఉన్నారని, కావాలని కొంతమంది ఇలా ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారని మండి పడుతున్నారు ఫ్యాన్స్. అయితే కొంత మంది నెటిజన్స్ మాత్రం వీటిని అంగీకరించడం లేదు. వాళ్లిద్దరికీ స్టార్ వార్ నడుస్తుందని అందుకే చరణ్ బర్త్ డే కు విష్ కూడా చేయలేదని అంటున్నారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులకు విషెస్ కూడా చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు పలువురు నెటిజన్స్.

అయితే ఈ స్టార్ వార్ వార్తలపై మాత్రం అటు బన్నీ, ఇటు రామ్ చరణ్ ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ చిరంజీవి, అరవింద్ లు మాత్రం ఇలాంటి వార్తల్ని కొట్టిపారేస్తున్నారు. తాము కలిసే ఉన్నామని చెబుతున్నారు. పైగా ఇటీవలే బన్నీ 20 ఏళ్ల సినిమా కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి విషెస్ కూడా చెప్పారు. మరి తాజాగా అల్లు స్నేహారెడ్డి చేసిన ఈ పోస్ట్ తో ఈ స్టార్ వార్ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి. ఇక చరణ్, బన్నీ లు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. బన్నీ ‘పుష్ప 2’ షూటింగ్ పనిలో బిజీగా ఉండగా చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.

Also Read: ‘దసరా’ రివ్యూ - నాని పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

టాప్ హెడ్ లైన్స్

Chitti Chitti Cheema Song Lyrics: చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
చిట్టి చిట్టి చీమ లిరిక్స్... దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' కోసం శ్రీమణి ఏం రాశారంటే?
ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్
Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Pavala Shyamala: మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు
మహాప్రస్థానంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు... హాజరైన కరాటే కల్యాణీ, హేమ, రఘుబాబు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget