కూతురు రాహా కోసం రూట్ మార్చిన ఆలియా భట్ ! ఇకపై అలాంటి సినిమాలు చేస్తానని క్లారిటీ
Alia Bhatt : బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఇకపై కామెడీ సినిమాలు చేస్తానని చెబుతోంది. కూతురు రహా స్ఫూర్తితో తనలో ఈ మార్పు వచ్చిందని చెబుతోంది..

Alia Bhatt Movie: Raazi, Dear Zindagi, Gangubai Kathiawadi లాంటి మూవీస్ తో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt). ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క అన్నట్టు...తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై అభిమానులకు క్లారిటీ ఇచ్చేశారు ఆలియా. ఇందుకు కారణం తన కుమార్తె రాహా అని కూడా చెప్పారు.

ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తన ప్రస్తుత సినిమాలతో పాటూ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పారు ఆలియాభట్. ఇప్పటివరకూ విభిన్న కథలను ఎంపిక చేసుకుని నటించాను కానీ ఇప్పటివరకూ రాహా చూసేలా ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకే తన కుమార్తె చూసేలా కామెడీ మూవీలో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు.
ఓవైపు హీరోయిన్ గా దూసుకెళ్తూనే మరోవైపు ఫ్యామిలీకి కేటాయించే టైమ్ విషయంలోనూ రాజీ పడకుండా ప్లాన్ చేసుకుంటారు ఆలియా భట్. ఎప్పటికప్పుడు రాహా గురించి వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తారు.. ఇప్పుడు కెరీర్ విషయంలోనూ రాహా కోసమే తన నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పారు ఆలియా భట్. అందుకే ఇప్పటి వరకూ చేసిన కథల కన్నా భిన్నమైనవి ఎంచుకుంటానని అన్నారు. ఇప్పటివరకూ తాను నటించిన సినిమాలు ఏవీ రాహా చూసి ఎంజాయ్ చేసేలా ఉండవ్. అందుకే ఇకపై తను హాయిగా నవ్వుకునేలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నా అని ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. తనకోసమే జానర్ మార్చుకున్నానన్న ఆలియా ఇప్పటికే కొన్ని సినిమాలకు సైన్ చేశానని ఆ పూర్తివివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.
షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోవైపు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడం అలవాటుగా మారిందన్న ఆలియా...తన భర్త రణబీర్ కపూర్ తో కలసి నటించిన లవ్ అండ్ వార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇద్దరూ కలసి షూటింగ్ కి వెళ్లినప్పుడు రాహాను చూసుకోవడం సవాలుగా మారిందని.. ఎందుకంటే ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం రాత్రి వేళల్లో షూట్ చేశారు. సెట్ కి మాతోపాటూ కలసివచ్చినప్పుడు రాహా ఎంజాయ్ చేసేది కానీ ఎక్కువ సమయం తనతో టైమ్ స్పెండ్ చేయడం కుదిరేదికాదని షేర్ చేసుకున్నారు ఆలియా.
త్వరలో శివ్ రావల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా' అనే యాక్షన్ థ్రిల్లర్‌లో నటించనుంది ఆలియా భట్. ఈ మూవీలో ఆమె ఆల్-విమెన్ కంబాట్ యూనిట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా నటిస్తోంది. శర్వరి వాఘ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగం. దీంతో పాటూ రణ్‌బీర్ కపూర్ సంజయ్ లీలా భన్సాలీతో కలిసి 'లవ్ & వార్'లో నటిస్తోంది, ఇందులో విక్కీ కౌశల్ కూడా ఉన్నాడు. ఈ తర్వాత చేయబోయే ప్రాజెక్టులన్నీ నవ్వులు పూయించేవే అని హింట్ ఇచ్చారు. తన భర్త రణబీర్ కపూర్ నటించిన ‘బర్ఫీ’ మూవీ రాహా చూడగలిగేలాగా ఉంటుంది. అలా సరదాగా సున్నితంగా సాగిపోయే సినిమాల్లో నటిస్తానని చెప్పారు ఆలియా
ఏదేమైనా రాహా కోసం ఆలియా తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది.






















