Akshay Kumar : ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడిగా బాలీవుడ్ హీరో.. కన్నప్ప మూవీ నుంచి అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
Akshay Kumar as Lord Shiva : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్‌ని కన్నప్ప టీమ్ రిలీజ్ చేసింది. పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ చాలా స్టన్నింగ్‌గా కనిపించారు.

Akshay Kumar Look From Kannappa : కన్నప్ప సినిమా నుంచి శివుడి లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి లుక్‌ని రిలీజ్ చేస్తూ మూవీ మీద హైప్ పెంచుతున్నారు. రీసెంట్గా కాజల్ అగర్వాల్ పార్వతీ లుక్‌ని రిలీజ్ చేసి బజ్ క్రియేట్ చేసిన మూవీ టీమ్.. తాజాగా పరమేశ్వరుడి రూపంలో ఉన్న అక్షయ్ కుమార్ లుక్‌ని విడుదల చేసింది.
అక్షయ్ కుమార్ లుక్‌ని ఆరు భాషల్లో విడుదల చేస్తూ.. సోషల్ మీడియాలో కన్నప్ప టీమ్ ఫోటోలు షేర్ చేసింది. ముల్లోకాలను ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు అనే క్యాప్షన్‌తో శివుడి లుక్‌ని రిలీజ్ చేశారు. ॐ The Eternal Protector ॐ Unveiling @akshaykumar as *𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, a captivating presence of divinity, power, and serenity in #Kannappa🏹.✨ Dive into the ageless story of unwavering love, devotion, and sacrifice. Experience the grandeur on the big screen this April 2025! 🎥✨ #LordShivaॐ #HarHarMahadevॐ Om Namah Shivaya ॐ అనే క్యాప్షన్‌తో విడుదల తేదితో ఉన్న ఫోటోలను చిత్రబృందం షేర్ చేశారు.
ఈ విషయాన్ని తెలుపుతూ.. అక్షయ్ కూడా లుక్ షేర్ చేసి.. Stepping into the sacred aura of Mahadev for #Kannappa🏹. Honored to bring this epic tale to life. May Lord Shiva guide us on this divine journey. Om Namah Shivaya!
#LordShivaॐ #HarHarMahadevॐ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. సినిమాపై బజ్ పెంచారు.
View this post on Instagram
శివుడి లుక్‌లో అక్షయ్ కుమార్..
శివుడి లుక్‌లో కనిపించడం అక్షయ్ కుమార్‌కి కొత్తేమి కాదు. ఓ మై గాడ్ 2లో అక్షయ్ శివుడి రూపంలో కనిపించాడు. అయితే ఇప్పటి కన్నప్ప లుక్ ప్రేక్షకుల కొత్తగాని.. బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తకాదు. కానీ తాజాగా విడుదల చేసిన పరమేశ్వరుడి లుక్‌లో అక్షయ్ స్టన్నింగ్‌గా కనిపించారు. రెండు సినిమాల కథ వేరు కాబట్టి.. ఈ లుక్ దానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. శివ తాండవం చేస్తున్నట్లు ఉన్న పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది.
ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్పూర్తిగా తీసుకుని కన్నప్పగా చేస్తూ.. ఈ సినిమాను మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్‌గా వస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉన్నారు. మంచు మోహన్‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమాను ముకేష్ కుమార్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25, 2025వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ చేస్తున్నారు. నంది పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఈ సినిమాకు ఇదే అతి పెద్ద ప్లస్ కానుంది. మోహన్ లాల్, మోహన్ బాబు, ముఖేష్ రుషి, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. విష్ణు పిల్లలు కూడా ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనున్నారు.
Also Read : మూడేళ్లలో 32 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్.. కుష్బూ వెయిట్ లాస్ జర్నీ ఇదే






















