అన్వేషించండి

Akshay kumar: బాలీవుడ్ స్టార్ హీరోకు మాతృవియోగం... ఎమోషనల్ పోస్టు

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

అగ్రనటుడు అక్షయ్ కుమార్  తల్లి అరుణా భాటియా కన్నుమూశారు.  ఈ విషయాన్ని అతనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఆమె వయసు ఎనభై ఏళ్లు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆమెను సెప్టెంబరు 3న ముంబైలోని హీరానందని హాస్పిటల్ లో  చేర్పించారు కుటుంబసభ్యులు. అదే ఆసుపత్రిలో అరుణా చికిత్స పొందుతూ మరణించారు.  ఈ ఘటన జరిగినప్పుడు అక్షయ్ కుమార్ ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్లో ఉన్నారు. తల్లి మరణ వార్త తెలియగానే హుటాహుటిన ముంబై చేరుకున్నారు. 

తన తల్లి మరణవార్తను తెలియజేస్తూ ట్విట్టర్ లో ‘తనే నాకు ముఖ్యమైన వ్యక్తి.  ఈ రోజు నేను భరించలేనంత బాధను అనుభవిస్తున్నా. నా మాతృమూర్తి అరుణభాటియా ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. మరోలోకంలో మా నాన్నగారితో ఏకమయ్యారు. మీరు నాకోసం, నా కుటుంబం కోసం చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు’ అని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 

తల్లి చనిపోవడానికి ఒకరోజు ముందే అక్షయ్ తన తల్లి ఆరోగ్యం కోసం ప్రార్ధన చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ, ప్రతి ఒక్కరి ప్రార్ధన తల్లి శ్రేయస్సుకు ఎంతో సహకరిస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన మరుసటి రోజే ఆమె మరణించడం అక్షయ్ అభిమానులను కలచి వేస్తోంది. అక్షయ్ అభిమానులు, బాలీవుడ్ నటులు అరుణా భాటియాకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. 

అక్షయ్ కుమార్ తండ్రి హరిఓం భాటియా. ఈయన భారత సైన్యంలో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీలోని యునిసెఫ్ కార్యాలయంలో అకౌంటంట్ గానూ ఉద్యోగం చేశారు.  2000 సంవత్సరంలో ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించారు. అక్షయ్ కు తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. తన తండ్రి చనిపోయాక ఆయన గౌరవార్థం తన ప్రొడక్షన్ హౌస్ కి ‘హరిఓం ఎంటర్టైన్మెంట్’ అని పేరు పెట్టారు. పోలీసాఫీసర్ల కోసం హరి ఓం షెల్టర్ పేరుతో బిల్డింగ్ కూడా నిర్మించారు. 

Also read: తొలిసారి ఓ దేశ అధికారిక కరెన్సీగా బిట్ కాయిన్

Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం

Also read: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: రివ్యూలపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్... ఎవరూ ఊహించలేదయ్యా
రివ్యూలపై రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్... ఎవరూ ఊహించలేదయ్యా
New Age Megastar: ఇప్పుడు రామ్ చరణ్ 'న్యూ ఏజ్ మెగాస్టార్'... ప్రధాని ఇచ్చిన ట్యాగ్, అనౌన్స్ చేసిన చిరంజీవి
ఇప్పుడు రామ్ చరణ్ 'న్యూ ఏజ్ మెగాస్టార్'... ప్రధాని ఇచ్చిన ట్యాగ్, అనౌన్స్ చేసిన చిరంజీవి
Maa Inti Bangaram Collections Day 5: వీకెండ్ తర్వాత ఎలాగుంది బంగారం? సమంత సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
వీకెండ్ తర్వాత ఎలాగుంది బంగారం? సమంత సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Trisha Celebrates Vijay Birthday: బ్రేకప్ కాలేదు... విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష
బ్రేకప్ కాలేదు... విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Sreemukhi Saree Photos: శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
Embed widget